Expert Face Washing Tips: నేటి హడావిడి జీవితంలో చాలామందికి తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేక సతమతమవుతున్నారు. ఈ అలవాటు వల్ల భవిష్యత్తులో అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. వాటిలో చర్మ సంబంధిత సమస్య కూడా ఒకటి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ముఖంలో గ్లో మాయమవడం ప్రారంభమవుతుంది. అందుకే చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి ప్రతిరోజూ ముఖం కడుక్కోవడం చాలా ముఖ్యం. ముఖం తాజాగా, ప్రకాశవంతంగా మెరిసిపోయేందుకు మార్కెట్లో లభించే ఎన్నో రకాల ఉత్పత్తులు ఉపయోగిస్తారు. కానీ ముఖం కడుక్కునేటప్పుడు ఈ విషయాలు పట్టించుకోరు. అందుకే ఎంత జాగ్రత్తలు పాటించినా ఈ సమస్యలు వస్తాయి. అలా జరగకూడదంటే ఫేస్ వాష్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేస్తున్నారు. ముఖం కడుక్కునేందుకు ఏ పద్దతి సరైనదో వివరంగా తెలుసుకుందాం.
ముఖం ఎలా కడుక్కోకూడదు..
-
స్క్రబ్బింగ్: అధికంగా స్క్రబ్బింగ్ చేయడం లేదా రుద్దడం వల్ల ముఖం పై పొరలు తొలగి మంట, చికాకు వస్తుంది. ఈ పద్ధతి చర్మాన్ని కూడా బలహీనపరుస్తుంది. అందుకే వీలైనంతవరకూ చేతులతో కడుక్కోండి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే సున్నితంగా స్క్రబ్ చేయండి.
-
ఫేస్ వాష్: ఫ్రెష్‌గా, శుభ్రంగా ఉండాలని కొందరూ మాటిమాటికీ ముఖం కడుగుతూ ఉంటారు. ఏదైనా పనిచేసి ముఖం వాడిపోయినప్పుడు ముఖం కడిగినా తప్పులేదు. కానీ, అనవసరంగా పదేపదే ముఖం కడిగితే పొడిబారి నిర్జీవంగా తయరవుతుంది. అందుతే రోజుకు రెండుసార్లకు మించకుండా ముఖాన్ని కడుక్కోవాలి.
-
వేడి నీళ్లు: ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లు చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. ముఖం జీవం కోల్పోయి మెరుపు తగ్గుతుంది. అందుతే చల్లటి నీరు లేదా గోరువెచ్చని నీటినే ఫేస్ వాష్ కోసం వాడాలి.
-
ఫేస్ వాష్: మీ చర్మ తత్వాన్ని బట్టి ఫేస్ వాష్ ఎంచుకోవాల్సి ఉంటుంది. పొడి చర్మం, జిడ్డు చర్మం లేదా మొటిమల సమస్య ఉన్నవాళ్లు వారికి సరిపోయే ఉత్పత్తులనే వాడాలి. లేకపోతే చర్మ అలర్జీలు పెరిగే అవకాశం ఉంది.
ముఖం కడుక్కున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ముఖం కడుక్కున్న తర్వాత కాటన్ క్లాత్ లేదా మెత్తటి టవల్‌తో ముఖాన్ని సున్నితంగా తుడవండి. ఆ తర్వాత ముఖంపై మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఎండలో బయటకు వెళ్తుంటే సన్‌స్క్రీన్ వాడటం మర్చిపోవద్దు.
Read Also: Curd after lunch: ప్రతిరోజూ భోజనం తర్వాత పెరుగు తింటే.. శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా..
Matcha Drink Benefits: కాఫీ, చాయ్ బదులు ఇది తాగండి.. మీకు తిరుగే ఉండదు..
Summer Superfood: పీఎం మోదీ ఏడాదిలో 300 రోజులు తినే మఖానా స్పెషల్ రెసిపీ ఇదే..