24 అభివృద్ధి పనులు..
నియోజకవర్గంలోని మండలాల వారీగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరైన రోడ్లతో పాటు నూతనంగా ఏర్పడిన చిల్పూర్, వేలేరు మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలు, ఆయిల్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్, బంజారా భవన్, ఐటీడీఏ రోడ్డు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. ఇలా మొత్తంగా రూ.800 కోట్లతో 14 శాఖలకు సంబంధించిన 24 అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.