ABN
, Publish Date – Mar 19 , 2025 | 03:32 PM
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2025 రిజల్ట్స్ వచ్చేశాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT రూర్కీ) ఈ ఫలితాలను విడుదల చేసింది.

GATE 2025 Results out
గేట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా గేట్ 2025 ఫలితాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ విడుదల చేసింది. గేట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లైన gate2025.iitr.ac.in లేదా goaps.iitr.ac.inలలో చెక్ చేసుకుని తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం గేట్ పరీక్ష నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కీకి అప్పగించారు.
గేట్ 2025 పరీక్షను ఫిబ్రవరి 1, 2, 15, 16, 2025 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహించారు. ఈ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు రెండు సెషన్లలో జరిగింది.
గేట్ 2025 ఫలితాలు ఎలా తనిఖీ చేయాలి
గేట్ 2025 ఫలితాలను తనిఖీ చేసుకోవడం చాలా సులభం. మీరు ఈ సులభమైన స్టెప్స్ అనుసరించాల్సి ఉంటుంది. ఫలితాలను తెలుసుకోవడానికి ముందు అధికారిక వెబ్‌సైట్ (gate2025.iitr.ac.in లేదా goaps.iitr.ac.in)ను సందర్శించండి. ఆ తర్వాత లాగిన్ ఆప్షన్ ఎంచుకోండి. మీ లాగిన్ వివరాలను (రెజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్) నమోదు చేయండి. ఆ తర్వాత సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
Updated Date – Mar 19 , 2025 | 03:33 PM