ABN
, Publish Date – Apr 09 , 2025 | 09:57 AM
Gas Cylinder Users: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగ భగమంటున్నాడు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కలిగించడానికి పలు కార్యక్రమాలు చేపట్టారు.

Gas Cylinder Users
ఏప్రిల్ మొదలైన నాటినుంచి భానుడు రెచ్చిపోయి ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది కాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో అయితే.. పరిస్థితి దారుణంగా ఉంటోంది. బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విపరీతమైన ఎండల కారణంగా దేశంలోని పలు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో కరెంట్ ఓవర్‌లోడ్ కారణంగా కరెంట్ వైర్లు ఫెయిల్ అయ్యి షార్ట్ సర్య్క్యూట్లు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తగు జాగ్రత్తలు పాటించటం వల్ల ప్రమాదాల బారిన పడకుండా ఉండొచ్చని అంటున్నారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ సముదాయాలు, పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సులు చేపడుతున్నారు. జనసంచారం ఉండే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే.. వీలైనంత త్వరగా మంటలు ఆర్పడానికి ట్యాంక్స్, డ్రమ్స్ వంటి వాటిలో నీటిని ఉంచాలని పోలీసులు తెలిపారు. గ్యాస్ వినియోగదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గ్యాస్ వాడకం అయిపోగానే సిలిండర్ ఆఫ్ చేసుకోవాలని, గ్యాస్ పైపును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అన్నారు. డ్యామేజ్ అయిన పైపును వెంటనే మార్చుకోవాలన్నారు. గ్యాసు వాడుకునే గదిలోకి గాలి వచ్చిపోయేలా చూసుకోవాలన్నారు. ఎండాకాలం గ్యాస్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. అంతేకాకుండా.. కరెంట్ వాడకం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలన్నారు.
కరెంట్ ఓవర్‌లోడ్ అవ్వకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. లూజ్ కనెక్షన్లు ఉన్నా.. డ్యామేజీ అయిన వైర్లు ఉన్నా వాటిని వెంటనే బాగు చేయించుకోవాలన్నారు. కమర్షియల్ సముదాయాల్లో షాపులు క్లోజ్ చేసిన తర్వాత మెయిన్ ఆఫ్ చేయటం ఉత్తమం అంటున్నారు. కరెంట్ ఓవర్ లోడ్ అవ్వకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. అంతేకాదు.. ఎలక్ట్రానిక్ వాహనాలు వాడే వారు ఎండలో వాహనాలను పార్క్ చేయవద్దని సలహా ఇస్తున్నారు. ఎక్కువ దూరం ప్రయాణించిన తర్వాత చల్లగా ఉన్న ప్రదేశంలో వాహనాన్ని నిలపాలన్నారు. బీడీలు, సిగరెట్లు తాగే వారు.. పీకలను ఎక్కడ పడితే అక్కడ పాడేయవద్దని అన్నారు. ముఖ్యంగా చెత్తలో వేయోద్దని చెప్పారు. సిగరెట్ తాగిన తర్వాత పూర్తి ఆపేసి నేలపై పడేయాలన్నారు.
ఇవి కూడా చదవండి:
Ice Cream: ఫ్లేవర్ గుర్తిస్తే రూ. 3లక్షలు మీవే..
డ్రైవర్‌కి రెస్ట్
Updated Date – Apr 09 , 2025 | 10:01 AM