Gaddar Telangana Movie Awards Curtain Raiser Held in Hyderabad

Written by RAJU

Published on:

  • గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమం
  • కార్యక్రమానికి హాజరైన భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, జయసుధ
  • కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భట్టి విక్రమార్క
  • దశాబ్ద కాలంగా పరిశ్రమ ఎలాంటి ప్రోత్సాహకాలను నోచుకోలే
  • ఇది మంచి సంప్రదాయం కాదని సీఎం భావించారు: భట్టి
Gaddar Telangana Movie Awards Curtain Raiser Held in Hyderabad

హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్‌లో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు, సీనియర్ నటి జయసుధ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసుకున్న అవార్డులని.. దశాబ్ద కాలంగా పరిశ్రమ ఎలాంటి ప్రోత్సాహకాలకు, అవార్డులకు నోచుకోలేదన్నారు. దశాబ్దకాలంగా నిర్లక్ష్యంగా చేయడం మంచి సంప్రదాయం కాదని సీఎం భావించినట్లు తెలిపారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయని.. తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేశారన్నారు.

READ MORE: AP SSC Results 2025: రేపు పదో తరగతి ఫలితాలు విడుదల.. వాట్సప్‌లోనూ రిజల్ట్స్!

“గద్దర్ పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టం. తన పాటతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయం. కళలకు పుట్టినిల్లు హైదరాబాద్. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉంది. ప్రతివారు ఈ అవార్డులు గురించి మాట్లాడుకునేలా వేడుకలు చేస్తాం. చలన చిత్ర అవార్డులతోపాటు వ్యక్తిగత అవార్డులను కూడా పొందుపర్చాం. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండేలా అవార్డుల ప్రదానం చేస్తాం.” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

READ MORE: Kesineni Nani vs Kesineni Chinni: తన తమ్ముడిని టార్గెట్‌ చేసిన కేశినేని నాని.. సీఎంను ట్యాగ్‌ చేస్తూ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు..!

 

 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights