Fridge Water Vs Clay Pot Water: వేసవిలో ఏ నీరు తాగితే మంచిది..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

Written by RAJU

Published on:

Fridge Water Vs Clay Pot Water: వేసవిలో ఏ నీరు తాగితే మంచిది..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

వేసవి కాలం వచ్చేసింది. ఈ కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. ఎక్కువ మంది ఫ్రిజ్ నీటిని తాగుతూ ఉంటారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి హాని కలిగించొచ్చు. మట్టికుండలో నీటిని నిల్వ చేసుకుని తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. పాతకాలంలో ప్రతి ఇంట్లో మట్టికుండ ఉండేది. ఇప్పుడు మట్టికుండ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

మట్టికుండలు సహజంగా నీటిని చల్లగా ఉంచే గుణాన్ని కలిగి ఉంటాయి. మట్టికుండ నిర్మాణం రంధ్రాలుగలది. ఈ రంధ్రాల ద్వారా నీరు ఆవిరి అయి బయటికి వెళ్లడం వల్ల లోపల ఉన్న నీరు సహజంగా చల్లబడుతాయి. ఫ్రిజ్ నీరు ఆకస్మికంగా అధిక చల్లదనాన్ని కలిగించి గొంతుకు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ మట్టికుండ నీరు మితమైన చల్లదనంతో శరీరాన్ని సున్నితంగా ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.

మట్టికుండలు సహజంగా ఆల్కలైన్ లక్షణాలను కలిగి ఉంటాయి. నీటిని మట్టికుండలో నిల్వ చేయడం వల్ల మట్టిలోని ఖనిజాలతో నీరు మిళితమై శరీరంలో ఆమ్లత్వాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. ఆల్కలైన్ నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్లి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మట్టికుండలోని ఖనిజాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటాయి. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమై శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించేందుకు సహాయపడుతుంది. వేసవి కాలంలో ఎక్కువగా వచ్చే గ్యాస్, అసిడిటీ సమస్యలను తగ్గించేందుకు మట్టికుండ నీరు సహాయపడుతుంది.

మట్టికుండలు నీటిని సహజంగా శుద్ధి చేస్తాయి. ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ చేసే నీటిలో హానికరమైన రసాయనాలు కలిసే అవకాశం ఉంటుంది. కానీ మట్టికుండలో నీటిని నిల్వ చేయడం వల్ల అవి మలినాలను తొలగించి నీటిని తాగడానికి సురక్షితంగా మారుస్తాయి. ఎండల్లో డీహైడ్రేషన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మట్టికుండలోని నీరు సహజమైన ఉష్ణోగ్రతలో ఉండటంతో శరీరాన్ని మితంగా హైడ్రేట్ చేస్తుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను సమతుల్యం చేస్తుంది.

ప్లాస్టిక్ లేదా మెటల్ బాటిళ్లలో నిల్వ చేసిన నీటికి కొన్ని రసాయనాల ప్రభావం ఉండొచ్చు. కానీ మట్టికుండలో నిల్వ చేసిన నీరు సహజమైన మృదువైన రుచిని కలిగి ఉంటుంది. దీని వల్ల తాగడానికి మరింత రుచిగా అనిపిస్తుంది. ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో భూమి కాలుష్యం అధికమవుతోంది. మట్టికుండలు పూర్తిగా సహజ పదార్థాలతో తయారవ్వడం వల్ల పర్యావరణానికి హాని కలిగించవు. ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని తగ్గించేందుకు మట్టికుండలు మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని నిల్వ చేసేప్పుడు హానికరమైన రసాయనాలు నీటిలో కలిసే అవకాశం ఉంటుంది. కానీ మట్టికుండలో నిల్వ చేసే నీరు పూర్తిగా సహజమైనదిగా ఉంటుంది. దీని వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది.

శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ బయటికి వెళ్లేందుకు మట్టికుండ నీరు సహాయపడుతాయి. ఇది మెటాబాలిజం మెరుగుపరచి, బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల శరీరానికి కావలసిన శక్తి లభించి తేలికగా ఉండటానికి సహాయపడుతుంది. మట్టికుండలు గ్రామీణ ప్రాంతాల్లో చేతివృత్తిగా తయారవుతాయి. ఇవి వినియోగించడం ద్వారా గ్రామీణ కార్మికులను ఆదుకోవచ్చు. ఇది సంప్రదాయ కళను కొనసాగించేందుకు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచేందుకు ఉపయోగపడుతుంది.

Subscribe for notification