- ఎమ్మెల్యే ఫొటోలను ప్రొఫైల్ ఫొటోగా వాడుకుని
- 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి
- ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సోషల్ మీడియా ఉపయోగించుకుని మోసాలకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యే ఫొటోలను ప్రొఫైల్ పిక్ గా వాడుకుని యువతులను బురిడీ కొట్టించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్నాడు. దీనికోసం షాడి డాట్ కామ్ ను ఉపయోగించుకున్నాడు. షాది డాట్ కామ్ మోసగాడి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
Also Read:Cyberabad: మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం.. ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు
ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను వాడుకున్నట్లు నిందితుడు జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్హ వెల్లడించాడు. నాలుగు రాష్ట్రాల్లో 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్నట్టు విచారణలో తేలింది. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తో పాటు కాకినాడలో ఒకే కాలేజీలో చదివిన వంశీకృష్ణ.. 2016 నుంచి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను తన ప్రొఫైల్ ఫోటోగా వాడినట్లు వంశీ కృష్ణ తెలిపాడు. మోసాల కోసం స్నేహితుల పేర్లతో మూడు సిమ్ కార్డులు వాడినట్లు పోలీసులు గుర్తించారు.