పెర్ఫ్యూమ్ వాడటం చాలా సులభం. జస్ట్ స్ప్రే చేస్తే చాలు. ఇది శరీరానికి రాసుకోవడం వల్ల మంచి సువాసన మిమ్మల్ని చుట్టుముట్టి మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఇందులో చక్కటి పరిమళాలు వల్ల మానసిక ప్రశాంతత కలిగి ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. కానీ రసాయనాలతో తయారయ్యే పెర్‌ఫ్యూమ్ సరిగ్గా ఉపయోగించకపోతే అత్యంత హానికరం కావచ్చు. శరీరంలోని కొన్ని భాగాల్లో అవగాహన లేక సెంటు స్ప్రే చేస్తే అందులో వాడే కెమికల్స్ తీవ్ర దుష్ప్రభావాలు కలిగిస్తాయి. ఈ రసాయనాలు అనేక చర్మవ్యాధులకు కారణమవుతాయి. అందువల్ల, ఏయే భాగాల్లో పెర్‌ఫ్యూమ్ ఉపయోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ శరీర భాగాల్లో పెర్‌ఫ్యూమ్ వాడవద్దు..
1.పెర్‌ఫ్యూమ్‌లో ఆల్కహాల్, ఇతర రసాయనాలు ఉంటాయి. ఇవి ముఖం, కళ్ళకు హానికలిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి.
2. అండర్ ఆర్మ్‌లకు ఎట్టి పరిస్థితుల్లో పెర్‌ఫ్యూమ్ పూయవద్దు. ప్రత్యేకించి షేవ్ చేసిన వెంటనే అస్సలు అప్లై చేయకండి. ఎందుకంటే ఇది చర్మంపై చికాకు, దద్దుర్లు కలిగిస్తుంది.
3. ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ పెర్‌ఫ్యూమ్ పూయడం చాలా హానికరం. ఇది చికాకుతో పాటు ఇతర చర్మ వ్యాధులు వచ్చేందుకు కారణమవుతుంది.
4. స్క్రాచ్ లేదా గాయం ఉన్న ప్రదేశానికి పెర్‌ఫ్యూమ్ రాయవద్దు. చికాకుతో, నొప్పిని కలిగి చెడు ప్రభావం చూపిస్తుంది.
5. నోరు, ముక్కు చుట్టూ పెర్‌ఫ్యూమ్ పూయడం మానుకోవాలి. పొరపాటున ఇలా చేస్తే ఇందులోని హానికరమైన రసాయనాలు నేరుగా శరీరంలోకి చేరి హాని కలిగిస్తాయి.
6. కడుపు, నాభి చుట్టూ ఉన్న చర్మం సున్నితంగా ఉంటుంది. ఇక్కడ పెర్‌ఫ్యూమ్ పూయడం అంత మంచిది కాదు.
7. చెవి లోపల లేదా చుట్టూ అప్లై చేయడం వల్ల చికాకు పట్టి క్రమంగా ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే, చెవి వెనుక పూయవచ్చు.
8. మీ చర్మంపై చెమట మరియు ధూళి ఉంటే, పెర్ఫ్యూమ్ రాయవద్దు. ఇది చికాకు మరియు సంక్రమణకు కారణమవుతుంది.
పెర్ఫ్యూమ్‌ను పరీక్షించడానికి చిట్కాలు
1. చర్మం పైన లేదా సాధారణ క్లాత్ పైన : మణికట్టు లేదా చెవి వెనుక చర్మం లేదా సాదా రంగు బట్టపైన కొద్ది మొత్తంలో అప్లై చేసి15-30 నిమిషాలు తర్వాత సువాసన ఎంత బలంగా ఉంది అనే దాన్ని బట్టి నాణ్యత అంచనా వేయండి.
2. ఉదయం పూట వాసన పీల్చుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. అప్పుడు పరీక్షిస్తే మేలు.
3. ఒకేసారి అనేక పెర్ఫ్యూమ్‌లను పరీక్షించడం మానుకోండి.
4.పెర్ఫ్యూమ్ టెస్టింగ్ స్ట్రిప్ ఉపయోగించి కూడా సువాసనను మరింత ఖచ్చితంగా అంచనా వేయవచ్చు.
5.పెర్ఫ్యూమ్‌ను రుద్దవద్దు. మీ చర్మం లేదా ఫాబ్రిక్‌పై సున్నితంగా అద్దండి.
ఇన్ఫెక్షన్ నివారణకు చిట్కాలు:
1. మంచి నాణ్యత, స్వచ్ఛత కలిగిన పెర్ఫ్యూమ్‌లనే ఎంచుకోండి. ఎందుకంటే, చౌకైన పెర్‌ఫ్యూమ్‌లలో నకిలీవే అధికం. ఇందులో ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే హానికరమైన రసాయనాలు అధికంగా ఉంటాయి.
2. పెర్‌ఫ్యూమ్‌ను నేరుగా పీల్చుకోవద్దు. కాస్త గాలి ఎక్కువగా ఉన్న గదిలో స్ప్రే చేసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు రావు.
3. స్ప్రే చేసుకునేటప్పుడు ఎంత పరిమాణంలో వేసుకుంటున్నారో గమనించండి. ఎందుకంటే పెర్‌ఫ్యూమ్ అధిక మొత్తంలో వాడితే ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
4. మణికట్టు, మెడ, చెవుల వెనుక, మోచేతులు వంటి పల్స్ పాయింట్లు ఉన్న ప్రదేశాలకే ఎల్లప్పుడూ పెర్‌ఫ్యూమ్ రాయండి. ఇలా చేస్తే సువాసన ఎక్కువసేపు ఉండి మీరు తాజా అనుభూతి చెందుతారు.
5. పెర్‌ఫ్యూమ్ బాటిల్ మూత శుభ్రంగా ఉంచుకోండి. ఎల్లప్పుడూ మూసి ఉంచండి. అప్పుడు దుమ్ము లేదా బ్యాక్టీరియా దానిలోకి ప్రవేశించదు.
6. కొత్త పెర్‌ఫ్యూమ్ అప్లై చేసుకునేటప్పుడు చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయండి. ఇది మీకు పెర్‌ఫ్యూమ్ అలెర్జీ ఉందో లేదో తెలియజేస్తుంది.
7. పెర్‌ఫ్యూమ్ రాసుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
8. పెర్‌ఫ్యూమ్ పిల్లలు. పెంపుడు జంతువులకు దూరంగా ఉంచండి.
9. గడువు ముగిసిన ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేబుల్ చదివి హైపోఆలెర్జెనిక్ లేదా సువాసన లేని వాటినే ఎంపిక చేసుకోండి.