హైదరాబాద్, ఏప్రిల్ 26: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (శంషాబాద్ ఎయిర్‌పోర్టు) (Shamshabad Airport) విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వారణాసి నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం (Indigo Flight) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. వారణాసి నుంచి విమానం బయలుదేరిన కొద్దిసేపటికి అందులో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని విమాన సిబ్బంది పైలెట్‌కు సమాచారం అందించారు. దీంతో పైలెట్ హుటాహుటిన విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు పైలెట్. అయితే ముందుగానే ఎయిర్‌పోర్టు సిబ్బందికి ప్రయాణికుడి గురించి సమాచారం అందించడంతో అంబులెన్స్‌తో సిద్ధంగా ఉన్నారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే హుటాహుటిన సదరు ప్యాసింజర్‌ను ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇంత చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రికి తరలించే లోపే ఆ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. అసలు ప్రయాణికుడికి ఏమైంది.. అతడి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
Nurse to MP: 45శాతం మేమే
కాగా.. ఈ నెలలోనే ఇండిగో విమానంలో ఓ ప్రయాణికురాలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ముంబై నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సుశీలా దేవి అనే ప్రయాణికురాలు తీవ్ర అనారోగ్యానికి గురైంది. వెంటనే విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు పైలెట్ ప్రయత్నించారు. అయితే అప్పటికే విమానం గాల్లో ఉండగానే సుశీలాదేవి మృతి చెందారు. ఉత్తప్రదేశ్‌కు చెందిన సుశీలా దేవి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అస్వస్థతకు గురవడంతో మహారాష్ట్రలోని చికాల్తానా ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. వైద్యులు ఆమెను పరీక్షించగా.. అప్పటికే సుశీలా దేవి మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈనెల 20న శంషాబాద్ నుంచి గోవా వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దాదాపు రెండున్నర గంటల పాటు ప్రయాణికులు పడిగాపులు కాశారు. విమానం ఆలస్యంపై ఎయిర్‌పోర్టు సిబ్బందితో వాగ్వివాదానికి కూడా దిగారు. ఎట్టకేలకు రెండున్నర గంటల తర్వాత విమానం గోవాకు బయలుదేరి వెళ్లింది.
ఇవి కూడా చదవండి
Liquor Scam: సజ్జల శ్రీధర్ రెడ్డిని పట్టుకున్న సిట్
Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం
Read Latest Telangana News And Telugu News
Updated Date – Apr 26 , 2025 | 09:47 AM