- ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు..
- హాట్‌లైన్‌లో పాకిస్తాన్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భారత్..

India warns Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయితే, ఎలాంటి కవ్వింపులు లేకుండానే పాకిస్తాన్ కాల్పు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతోంది. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పదే పదే జరుగుతున్న కాల్పుల ఉల్లంఘనపై భారత్ పాకిస్తాన్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
రెండు దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్(డీజీఎంఓలు) మంగళవారం హాట్‌లైన్‌లో భారత్ పాకిస్తాన్‌ని హెచ్చరించింది. మంగళవారం ఉదయం వరకు కాల్పుల విరమణ ఎల్ఓసీ వరకు మాత్రమే పరిమితమైంది. అయితే, రాత్రి జమ్మూ లోని పర్గ్వాల్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దళాలు కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Read Also: Smart TV explode: పేలిపోయిన ‘‘స్మార్ట్ టీవీ’’.. ఇద్దరికి గాయాలు..
పాకిస్తాన్, భారత్ సైనిక చర్యలకు సిద్ధమైందని, తమ ఆర్మీ, నేవీ సిద్ధంగా ఉందని ప్రకటించిన కొద్దిసేపటికే భారత్ వార్నింగ్ ఇచ్చింది. భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ తన కరాచీ పోర్టులో నేవీ షిప్‌లను, జలంతర్గాముల్ని మోహరించింది. దేశంలో విమాన కార్యకలాపాలను ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ 50 శాతానికి తగ్గించింది. పాక్ మంత్రి ఒకరు ఇప్పటికే భారత్ రాబోయే 24-36 గంటల్లో దాడి చేస్తుందనే సమాచారం తమ వద్ద ఉందని అన్నారు.
అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పర్గ్వాల్ సెక్టార్‌లో పాక్ ఉల్లంఘటన తర్వాత భారత దళాలు వేగంగా స్పందించాయి. అదనపు బీఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. మరోవైపు, ఎల్ఓసీ వెంబడి రాజౌరీ జిల్లాలోని నౌషేరా, సుందర్ బానీ సెక్టార్, జమ్మూ లోని అఖ్తూర్ సెక్టార్ , కాశ్మీర్ బారాముల్లా, కుప్వారా జిల్లా సరిహద్దుల్లో కూడా పాక్ కాల్పులకు తెగబడింది.