Fireplace Accident : ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశ్రుతి, టపాసులు పేల్చడంతో అగ్ని ప్రమాదం

Written by RAJU

Published on:

టపాసులతో అంటుకున్న మంటలు

ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గ్రాండ్ వెల్ కం చెప్పేందుకు కార్యకర్తలు, కంగన్ హాలు నిర్వాహకులు ఫ్లెక్సీలు, టెంట్లు ఏర్పాటు చేశారు. కాగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కంగన్ హాలు వద్దకు వస్తున్నారన్న సమాచారంతో అక్కడున్న కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు మొదలు పెట్టారు. టపాసులు, ఇతర క్రాకర్స్ ను అంటించగా.. మిరుగులు ఎగసి పడ్డాయి. అవి కాస్త టెంట్ కు అంటుకున్నాయి. క్రాకర్స్ నిప్పు రవ్వలతో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. మంటలు చెలరేగి టెంటు, బెలూన్ లు కాలిపోయాయి. అక్కడి నుంచి ఇతర షాపులకు మంటలు వ్యాప్తి చెందుతుండటంతో జనాలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. చుట్టుపక్కల షాపులు ఉన్న వాళ్లు కంగారు పడి దుకాణాలు మూసేశారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights