సరికొత్త డిజైన్ కలిగిన ఫ్యాన్ కోరుకునే వారికి కలర్ బాట్ స్టెల్లా క్యాడ్ చాలా బాగుంటుంది. ఇంటిలోని ఏ గదిలో బిగించుకున్నా మంచి లుక్ ఇస్తుంది. దీనిలోని బీఎల్ డీసీ మోటారు గరిష్టంగా 30 వాట్ల విద్యుత్ ను వినియోగించుకుంటుంది. ఇది 5 స్టార్ రేటింగ్ ఫ్యాన్ కావడంతో దాదాపు 67 శాతం వరకూ విద్యుత్ ఆదా అవుతుంది. నిశ్శబ్దంగా తిరగడం, ఫ్యాన్ లో ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్ బ్లేడ్ల దిశను మార్చే రివర్స్ మోడ్ అదనపు ఆకర్షణలు. ఈ సీలింగ్ ఫ్యాన్ నుంచి దాదాపు 20 అడుగుల దూరం వరకూ గాలి తగులుతుంది. అమెజాన్ లో రూ.3899కి ఈ ఫ్యాన్ ను కొనుగోలు చేయవచ్చు.
క్రాంప్టన్ ఎనర్జీయన్ హైపర్ జెట్ సీలింగ్ ఫ్యాన్ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మిగిలిన ఫ్యాన్లతో పోల్చితే సుమారు 50 శాతం తక్కువ విద్యుత్ ను ఉపయోగించుకుంటుంది. దీనికి బీఈఈ ద్వారా 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. 340 ఆర్పీఎం మోటారు వేగంతో గది అంతటా గాలి వీస్తుంది. రిమోట్ ద్వారా హైపర్ మోడ్, టైమర్, స్లీప్ మోడ్ లను సెట్ చేసుకోవచ్చు. ఫ్లాన్ల బ్రేడ్లపై ఉన్న యాంటీ రస్ట్ పూత కారణంగా తుప్పు పట్టే అవకాశం ఉండదు. అమెజాన్ లో ఈ ఫ్యాన్ రూ.2499కి అందుబాటులో ఉంది.
తక్కువ విద్యుత్ ను ఉపయోగించుకునే ఫ్యాన్లలో హావెల్స్ 1200 ఎంఎ మోజెల్ ఈఎస్ ఒకటి. స్వచ్ఛమైన తెల్లటి రంగుతో గదికి ప్రత్యేక అందం తీసుకువస్తుంది. దీనిలోని 390 ఆర్ఫీఎం వేగంతో తిరిగే మోటారు కారణంగా గాలి చాలా చక్కగా వీస్తుంది. వేడికి అనుగుణంగా వేగాన్ని సర్దుబాటు చేసుకోవడానికి ఐదు స్పీడ్ ఎంపికలు ఉన్నాయి. దీని మోటారు వందశాతం రాగిపూతను కలిగి ఉంది. ఫ్యాన్ సజావుగా తిరగడానికి డబుల్ బాల్ బేరింగ్ ఎంతో సహాయ పడుతుంది. ఈ ఫ్యాన్ రూ.1,999 ధరకు అమెజాన్ లో అందుబాటులో ఉంది.
ఓరియంట్ నుంచి విడుదలైన ఈ ఫ్యాన్ పనితీరు బ్రహ్మాండంగా ఉంటుంది. రిమోట్ సాయంతో వేగాన్ని ఆపరేట్ చేసుకునే వీలుంది. అలాగే స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ చేసుకోవచ్చు. దీంతో పాటు 2, 4, 6, 8 గంటలకు టైమర్ ను సెట్ చేసుకోవచ్చు. ఈ 48 అంగుళాల సీలింగ్ ఫ్యాన్ నుంచి గాలి గదిలోని అన్ని మూలలకు వస్తుంది. ఈ ఫ్యాన్ కు బీఈఈ ద్వారా 5 స్టార్ సర్టిఫికెట్ ఉంది. దీంతో విద్యుత్ బిల్లు దాదాపు 50 శాతం ఆదా అవుతుంది. ఫ్యాన్ వేగాన్ని బట్టి వెలిగే ఎల్ఈడీ లైట్ ఏర్పాటు చేశారు. అమెజాన్ లో రూ.2,999కి ఈ ఫ్యాన్ ను కొనుగోలు చేయవచ్చు.
గది నలుమూలలకు చక్కని గాలిని ప్రసరింపజేసే ఫ్యాన్లలో పాలీ క్యాబ్ ముందుంటుంది. 1200 ఎంఎం పరిమాణం కలిగిన మూడు బ్లేడ్ కారణంగా గాలి చాలా వేగంగా వస్తుంది. ఇంటిలోని ఏ గదిలోనైనా చక్కగా బిగించుకోవచ్చు. దీనిలోని జీటెక్ బ్లేడ్లకు తుప్పు పట్టే అవకాశం ఉండదు. కేవలం 52 వాట్ల విద్యుత్ ను మాత్రమే వినియోగించుకుంటుంది. పాలీ క్యాబ్ ఫ్యాన్ ను అమెజాన్ లో రూ.1899 ధరకు కొనుగోలు చేయవచ్చు.