ఢిల్లీ: ఈరోజు మీలో ఎవరికైనా బ్యాంకుల్లో అర్జంట్ వర్క్ ఉందా.. నేడే కచ్చితంగా పూర్తి చేయాల్సిన బ్యాంకు పనులు ఏవైనా ఉన్నాయా.. అయితే ఒక నిమిషం ఆగి ఈ వార్త చదివి ఓ క్లారిటీ తెచ్చుకుని.. ఆ తర్వాత మీ పనులు చూసుకొండి. ఎందుకంటే నేడు అనగా ఏప్రిల్ 10, గురువారం నాడు చాలా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. అందుకు కారణం ఏంటంటే.. గురువారం నాడు మహావీర్ జయంతి. చాలా రాష్ట్రాల్లో మహావీర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుంది. మరి దేశం అంతా ఈ సెలవు వర్తిస్తుందా అంటే కాదు. మరి నేడు ఏ ఏ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది.. అలానే తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉందా లేదా అంటే..
నేడు అనగా ఏప్రిల్ 10, గురువారం నాడు దేశంలోని చాలా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. కారణం మహావీర్ జయంతి. ఇది జైనులకు చాలా ముఖ్యమైన పండుగ. 24వ జైన తీర్థంకరుడు.. మహావీర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా జైనులు మహవీర్ జయంతి నిర్వహిస్తారు. చాలా రాష్ట్రాల్లో నేడు గవర్నమెంట్ హాలీడేనే. అంటే ప్రభుత్వ సంస్థలు, విద్యాలయాలు, బ్యాంకులు వంటివి పని చేయవు.
ఇవాళ గుజరాత్, మిజోరామ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. కనుక నేడు బ్యాంకు పని మీద వెళ్లాలనుకునే వారు.. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని.. మీ ఏరియాలో ఉన్న బ్యాంకు తెరిచి ఉంటుందా లేదా అన్నది తెలుసుకుని వెళ్తే మంచిది. ఇక మహావీర్ జయంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎలాంటి సెలవు ప్రకటించలేదు కనుక.. ఇవాళ ఏపీ, తెలంగాణలో బ్యాంకులు తెరిచే ఉంటాయి.
ఇక ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సగం కన్నా ఎక్కువ రోజులు సెలవులే వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో బ్యాంకులకు దాదాపు 16 రోజులు సెలవులు ఉన్నాయి. బ్యాంకులు బందు ఉన్నప్పటికి యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు మాత్రం అందుబాటులోనే ఉంటాయి. ఇక ఏప్రిల్ 14, సోమవారం నాడు అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు. కనుక ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా బ్యాంకులు బందు.