Financial institution Vacation: ఏప్రిల్ 18న బ్యాంకులకు సెలవు ఉంటుందా..? లేదా? కారణం ఏంటి? – Telugu Information | Good Friday 2025 Financial institution Vacation: Are banks opened or closed on April 18?

Written by RAJU

Published on:

గుడ్ ఫ్రైడే సమీపిస్తున్న కొద్దీ చాలా మంది బ్యాంక్ కస్టమర్లు ఏప్రిల్ 18, 2025న శాఖలు తెరిచి ఉంటాయా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల షెడ్యూల్ ప్రకారం.. త్రిపుర, అస్సాం, రాజస్థాన్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయి.

యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గుర్తుచేసుకునే క్రైస్తవ సెలవుదినం గుడ్ ఫ్రైడే రోజు బ్యాంకులు మూసి ఉంటాయి. ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లు, SMS బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, ATM సేవలు వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. ఈ సేవన్ని అందుబాటులో ఉంటాయి.

ఏప్రిల్ 2025 లో బ్యాంకు సెలవుల జాబితా:

RBI ప్రాంతాల వారీగా క్యాలెండర్ ప్రకారం, ఏప్రిల్ 2025 బ్యాంకు సెలవుల జాబితా గురించి తెలుసుకుందాం. అయితే ఈ సెలవులన్ని కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలపై ఆధార పడి ఉంటుందని గుర్తించుకోండి.

  1. ఏప్రిల్ 15 (మంగళవారం): బెంగాలీ నూతన సంవత్సరం. హిమాచల్ దినోత్సవం, బోహాగ్ బిహు – అస్సాం, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  2. ఏప్రిల్ 16 (బుధవారం): బోహాగ్ బిహు – అస్సాంలో బ్యాంకులకు సెలవు.
  3. ఏప్రిల్ 18 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే – త్రిపుర, అస్సాం, రాజస్థాన్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.
  4. ఏప్రిల్ 20 (ఆదివారం): ఈస్టర్ ఆదివారం – దేశవ్యాప్తంగా ఆదివారం సెలవు.
  5. ఏప్రిల్ 21 (సోమవారం): గరియా పూజ – త్రిపురలో బ్యాంకులు మూసి ఉంటాయి.
  6. ఏప్రిల్ 26 (శనివారం): నాల్గవ శనివారం – భారతదేశం అంతటా బ్యాంకులు మూసి ఉంటాయి.
  7. ఏప్రిల్ 27 (ఆదివారం): ఆదివారం సాధారణ సెలవు.
  8. ఏప్రిల్ 29 (మంగళవారం): భగవాన్ శ్రీ పరశురామ జయంతి – హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు.
  9. ఏప్రిల్ 30 (బుధవారం): బసవ జయంతి, అక్షయ తృతీయ – కర్ణాటక, ఇతర ఎంపిక చేసిన రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights