దేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు (మే 3న) బ్యాంకులకు సెలవు ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆర్బీఐ సెలవుల ప్రకారం చూస్తే మాత్రం దేశంలో చాలా ప్రాంతాల్లో ఈరోజు (మే 3, 2025) బ్యాంకులు తెరిచే ఉంటాయని తేలింది. ఈ రోజు నెల మొదటి శనివారం కావడంతో దేశంలోని బ్యాంకులు సాధారణంగానే పనిచేస్తాయి. కానీ రెండో, నాల్గో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. అందువల్ల మే 3న బ్యాంక్ శాఖలు సాధారణంగా పనిచేస్తాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో స్థానిక పండుగలు లేదా ఇతర కారణాల వల్ల బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది.
ఇతర ప్రాంతాల్లో
కాబట్టి మీకు ఏదైనా బ్యాంకు పని ఉంటే మీ ప్రాంతంలోని బ్యాంక్ శాఖ పరిస్థితి గురించి తెలుసుకుని వెళ్లడం మంచిది. తెలుగు రాష్టాల్లో ఈరోజు బ్యాంకులు సాధారణంగానే పనిచేస్తాయి. బ్యాంకు సెలవులు రాష్ట్రాలు, ప్రాంతాల ఆధారంగా మారుతుంటాయి. మే 9 (శుక్రవారం) కోల్‌కతాలో బ్యాంకులు మూతపడతాయి. మే 12 (సోమవారం) న్యూ ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, ముంబై, భోపాల్, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ, ఐజ్వాల్, అగర్తలా, బెలాపూర్, డెహ్రాడూన్, ఇటానగర్, జమ్మూ, కాన్పూర్, షిమ్లా, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.
ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం..
మే 16న సిక్కిం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో గ్యాంగ్‌టక్‌లోని బ్యాంకులు బంద్ ఉంటాయి. మే 26న అగర్తలాలో బ్యాంకులు మూతపడతాయి. మే 29 (గురువారం) మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా షిమ్లాలోని బ్యాంకులు మూతపడతాయి. బ్యాంక్ శాఖలు మూతపడినప్పటికీ, అన్ని ప్రధాన బ్యాంకుల ఆన్‌లైన్ సేవలు పూర్తిగా పనిచేస్తాయి.
ఈ సేవల్లో ఏటీఎం మెషీన్లు, కార్డ్ సేవలు, ఎన్‌ఈఎఫ్‌టీ/ఆర్‌టీజీఎస్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లు, ఖాతా నిర్వహణ కార్యకలాపాలు ఉన్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో ఈ సేవలు ఎటువంటి అసౌకర్యం లేకుండా బ్యాంకింగ్ సౌకర్యాలను అందిస్తాయి. మీరు మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా మీ ఖాతాను నిర్వహించుకోవచ్చు.
బ్యాంక్ సెలవుల ప్రభావం
బ్యాంక్ శాఖలు మూతపడిన రోజుల్లో చెక్ క్లియరెన్స్, లోన్ ఆమోదం లేదా ఇతర ఆఫ్‌లైన్ సేవలు ఆలస్యం కావచ్చు. అందువల్ల, ముఖ్యమైన బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే, ఆన్‌లైన్ సేవలను ఉపయోగించడం ద్వారా ఈ అసౌకర్యాలను తగ్గించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
RCB vs CSK: నేడు ఆర్బీబీ vs చెన్నై మ్యాచ్..ప్లే ఆఫ్ ఆశలు ముంచుతుందా..
Pakistan Ceasefire: కశ్మీర్‌లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్
Hyderabad vs Gujarat: ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
Read More Business News and Latest Telugu News
Updated Date – May 03 , 2025 | 11:37 AM