- ‘‘48 గంటల్లో పంటలు ఖాళీ చేయాలి’’..
- సరిహద్దు రైతులకు బీఎస్ఎఫ్ కీలక ఆదేశాలు..

Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సరిహద్దుల్లోని రైతులకు కీలక ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. సరిహద్దు వెంబడి ఉన్న రైతులు 48 గంటల్లో పంట కోత పూర్తి చేసి తమ పొలాలను ఖాళీ చేయాలని శనివారం బీఎస్ఎఫ్ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన భద్రతా చర్యల వల సరిహద్దు కంచె, జీరో లైన్ మధ్య ఉన్న సున్నితమైన జోన్‌లోని వ్యవసాయ భూమిని కలిగి ఉన్న రైతులు పొలాలను ఖాళీ చేయాలని అడిగారు. దీని వల్ల వేల మంది రైతులపై ప్రభావం పడుతుంది.
Read Also: TVS iQube: బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 150 కి.మీ. రేంజ్!
530 కి.మీ అంతర్జాతీయ సరిహద్దులో సుమారు 45,000 ఎకరాల సాగుపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఇది పంజాబ్ రైతులకు సవాల్‌గా మారింది. అమృత్‌సర్, తర్న్ తరణ్, ఫిరోజ్‌పూర్, ఫాజిల్కా జిల్లాల్లోని ఈ వ్యవసాయ ప్రాంతాలకు త్వరలో ప్రవేశం మూసివేయబడుతుందని, పరిస్థితి మరింత దిగజారితే వారి భూములకు నిరవధికంగా ప్రవేశం నిలిపేస్తామని గ్రామాల గురుద్వారాల ద్వారా హెచ్చరికల ప్రకటనలు చేశారు.
ఈ పరిస్థితిపై సరిహద్దు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారుర. పశుగ్రాసం తమ పశువులకు చాలా అవసరమని, శాంతి ఉన్నంత వరకు తాము పనిచేయడానికి అనునమతించాలని రైతులు కోరుతున్నారు. ఇటీవల వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో గోధుమ కోత ఇప్పటికే ఆలస్యమైంది. ఈ పరిస్థితుల్లో ఈ ఆదేశాలు వచ్చాయి. అయితే, రైతులు ప్రయోజనాలను మేము అర్థం చేసుకున్నామని, దీని కన్నా దేశ ప్రయోజనాలు, భద్రత ముఖ్యమని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. పంటల వల్ల గస్తీకి ఇబ్బందులు కలగకుండా బీఎస్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది.