ఇంటర్నెట్ డెస్క్: ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు చలి వేయడం సహజం. అయితే, ఇతరుల కంటే ఎక్కువగా చలి వేస్తోందంటే ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు అనుమానించాలి. ముఖ్యంగా విటమిన్ లోపాలు ఉన్నప్పుడు ఇలా అధికంగా చలి వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ సమస్య మూలాల గురించి ఈ కథనంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం (Health).
మన శరీరం సాధారణ ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్‌హైట్ ఉంటుంది. ఉష్ణోగ్రతను ఇదే స్థితిలో కొనసాగించేందుకు మెదడు, రక్తనాళాల, స్వేదగ్రంధులు ఉమ్మడిగా పనిచేస్తుంటాయి. దీంతో, వాతావరణంలో వేడి ఎలా ఉన్నా శరీరంలో మాత్రం ఒకే ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే, వివిధ రకాల బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు, వాతావరణంలో అసాధారణ మార్పులు, విటమిన్లు, ఇతర పోషకాల లోపాలతో ఈ సమతౌల్యం దెబ్బతిని చలిగా అనిపిస్తుంది.
శరీరంలో వేడి నియంత్రణను వైద్య పరిభాషలో థెర్మోరెగ్యులేషన్ అని అంటారు. ఇందుకు బీ12, ఫోలేట్, విటమిన్ సీ అత్యంత కీలకం. ఈ మూడు విటమిన్ల కారణంగా శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తి, ఆక్సిజన్ సరఫరా తగిన విధంగా జరిగి చలి వేయకుండా ఉంటుంది.
Cancer Risk: గుండె జబ్బులు ఉన్న వాళ్లకు క్యాన్సర్ ముప్పు ఎక్కువవుతుందా
ఎర్రరక్త కణాల్లోని హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ కీలకం. ఆక్సిజన్‌ను అన్ని కణాలకు సరఫరా చేసేది హిమోగ్లోమిన్యే. హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఆక్సీజన్ సరఫరా కుంటుపడుతుంది. దీంతో, కండరాలు, కణజాలం కావాల్సిన వేడిని ఉత్పత్తి చేయలేవు. దీంతో, మనకు చలివేస్తున్నట్టు అనిపిస్తంది.
ఇక రక్త కణాల ఉత్పత్తికి, మెదడు పని తీరుకు బీ12 విటమిన్ కూడా కీలకం. ఇది తక్కువైనప్పుడు ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి రక్తహీనత వస్తుంది. ఫలితంగా చలి ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా కాళ్లు, చేతులు బాగా చల్లబడినట్టు అనిపిస్తాయి.
ఎర్రరక్త కణాల ఉత్పత్తికి బీ12తో పాటు బీ3 (ఫోలేట్) విటమిన్ కూడా అవసరం. ఫోలేట్ తక్కువైతే చలితో పాటు అలసట, రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది.
BP: బీపీ అదుపులో ఉండాలంటే ఈ ఆయుర్వేద సూచనలు ఫాలో కావాలి
ఆహారంలోని ఐరన్‌ను శరీరం పూర్తి స్థాయిలో గ్రహించాలంటే విటమిన్ సీ కూడా అవసరమే. కాబట్టి, శరీర ఉష్ణోగ్రత నియంత్రించడంలో విటమిన్ సీ పరోక్ష పాత్ర పోషిస్తుంది.
కాబట్టి, చలి ఎక్కువగా వేస్తోందన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఇందుకు గల కారణాలు ఏంటో తెలిసిపోతుంది. రక్త పరీక్ష ద్వారా విటమిన్ లోపాలు ఉన్నాయో లేదో తెలుసుకుని ఆ మేరకు చికిత్స అందిస్తే సమస్య సులువుగానే పరిష్కారమవుతుంది.
Read Latest and Health News