FDI Labs Launches First Superior Cyber Lab in Hyderabad for Digital Forensics and Knowledge Restoration

Written by RAJU

Published on:

FDI Labs Launches First Superior Cyber Lab in Hyderabad for Digital Forensics and Knowledge Restoration

FDI Cyber Lab: హైదరాబాద్ నగరంలో డిజిటల్ ఫోరెన్సిక్స్, డేటా రికవరీ రంగాల్లో కీలక ముందడుగుగా FDI ల్యాబ్స్ నాంపల్లిలో తన తొలి అత్యాధునిక సైబర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఆఫీస్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక విభాగంగా పని చేసే ఈ ల్యాబ్, డిజిటల్ భద్రతా అవసరాల పరిష్కారానికి కీలక కేంద్రంగా మారనుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఆధునిక సైబర్ ల్యాబ్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ.. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు డేటా పునరుద్ధరణ (రికవరీ), డిజిటల్ ఫోరెన్సిక్స్, డేటా ఉల్లంఘనలపై విచారణ వంటి సేవలు అందించనున్నారు. సంక్లిష్టమైన డిజిటల్ పరిశోధనలకు ఈ ల్యాబ్ సిద్ధంగా ఉండేలా రూపొందించబడినదని వారు తెలిపారు.

Read Read: Hyderabad: భాగ్యనగరంలో ఇక కొత్త లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు..!

ఈ సౌకర్యం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల డిజిటల్ భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం కానుందనీ, ఈ ల్యాబ్ తెలుగు రాష్ట్రాలకు ప్రధాన కార్యాలయంగా సేవలందించనుందని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌లో ఇటువంటి అత్యాధునిక సైబర్ ల్యాబ్ ఏర్పాటు కావడం వలన, ఈ ప్రాంతంలో డిజిటల్ స్థితిస్థాపకతకు ఇది మూలస్తంభంగా నిలవనుందని పేర్కొన్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights