Fan Invades Eden Gardens to Meet Virat Kohli Throughout IPL 2025 Opener.

Written by RAJU

Published on:


  • గ్రౌండ్‌లోకి వెళ్లి కోహ్లీని హగ్ చేసుకున్న ఓ అభిమాని
  • తాజాగా సీక్రెట్ వెల్లడించిన రీతుపర్ణో పఖిరా
  • నేను కోహ్లీ సర్ పాదాలను తాకిన వెంటనే ఆయన నా పేరు అడిగారు
  • అనంతరం వేగంగా పారిపో అని చెప్పారు- రీతుపర్ణో పఖిరా
  • భద్రతా సిబ్బంది నన్ను కొట్టవద్దని కూడా కోరారు- అభిమాని.
Fan Invades Eden Gardens to Meet Virat Kohli Throughout IPL 2025 Opener.

ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని కలవడానికి ఓ అభిమాని గ్రౌండ్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో 18 ఏళ్ల యువకుడు రీతుపర్ణో పఖిరా అనే యువకుడు కోహ్లీని కలవడానికి మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌ జరుగుతుండగా.. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గ్రౌండ్‌లోకి వచ్చాడు. కోహ్లీ దగ్గరికి వచ్చి అతని పాదాలను తాకాడు. అంతేకాకుండా.. కోహ్లీని పైకెత్తి కౌగిలించుకున్నాడు. యువకుడు గ్రౌండ్ లోకి రావడం చేసి వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని బయటికి తీసుకెళ్లారు. అతన్ని తీసుకెళ్లే ముందు.. కోహ్లీ అతనిని ఏమొనద్దని సూచించాడు. “నేను కోహ్లీ సర్ పాదాలను తాకిన వెంటనే ఆయన నా పేరు అడిగి, ‘జల్దీ సే భాగ్ జా (వేగంగా పారిపో)’ అని చెప్పారు. అంతేకాకుండా.. భద్రతా సిబ్బంది నన్ను కొట్టవద్దని కూడా కోరారు” అని రీతుపర్ణో పఖిరా టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెల్లడించాడు.

Read Also: Robinhood: డేవిడ్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు

కాగా.. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 59 పరుగులు (36 బంతుల్లో, నాటౌట్) చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. ప్రారంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫిల్ సాల్ట్ (56 పరుగులు, 31 బంతుల్లో)తో కలిసి కోహ్లీ 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వారి అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆర్సీబీ 16.2 ఓవర్లలో 175 పరుగుల లక్ష్యాన్ని చేధించి.. కోల్‌కతాపై గత నాలుగు పరాజయాలకు ముగింపు పలికింది.

Read Also: Mohammed Siraj: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోవడంపై సిరాజ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 174/8 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (31 బంతుల్లో 56) రాణించినప్పటికీ.. మిగతా బ్యాటర్లు పరుగులు చేయలేకపోయారు. ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించాడు. 4 ఓవర్లు వేసి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో.. కృనాల్ పాండ్యా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు.

Subscribe for notification