Holiday Calendar April 2025 : విద్యార్ధులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వేసవి సెలవులు కూడా ఈ ఏప్రిల్ నెలలోనే ఉన్నాయి. ఏప్రిల్ నెల సెలవుల జాబితా, సమ్మర్ హాలిడేస్ ప్రారంభం తదితర వివరాలు తెలుసుకుందాం..

ఏప్రిల్ నెల సెలవులు :
- మార్చి 31వ తేదీ రంజాన్ పండుగ ఉంది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ కూడా పండుగ సెలవు ఉంటుంది. దీంతో రంజాన్ పండుగకు తెలంగాణలో రెండు రోజులు సెలవులు రానున్నాయి.
- ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం : ఈరోజు శ్రీరామనవమి. ఆలయాల్లో రాముల వారి పెళ్లి వైభవంగా జరుపుతారు. ఆ రోజున అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. కానీ ఈసారి శ్రీరామనవమి పండుగ ఆదివారం నాడే రానుండటంతో సాధారణంగా సెలవు ఉంటుంది.
- ఏప్రిల్ 10వ తేదీ గురువారం: మహావీర్ జయంతి. ఈ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉంటుంది.
- ఏప్రిల్ 14వ తేదీ సోమవారం : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు సెలవు ఉంటుంది.
- ఏప్రిల్ 18వ తేదీ శుక్రవారం : ఈరోజున ‘గుడ్ ఫ్రైడే’. ఇది ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు కూడా అన్ని పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఉంటుంది.
- ఇవి కాకుండా రెండో శనివారం, ఆదివారాలు కలిపి 5 ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏప్రిల్ నెలలో 7 లేదా 8 రోజులు సెలవులు రానున్నాయి.
ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు :
ఇదిలా ఉండగా.. వేసవి సెలవుల కోసం విద్యార్థులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక్కపూట బడులు (Half Day Schools) కొనసాగుతున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలో వేసవి సెలవులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం వేసవి సెలవుల్లో భాగంగా ఈసారి 45 రోజులకు పైగా పాఠశాలలు మూత పడనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 24 నుంచి సెలవులు ప్రకటించి.. తిరిగి జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హాలిడేస్‌పై స్పష్టత వచ్చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ అటు ఇంటర్మీడియట్, ఇటు పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఇక మిగిలింది 1 నుంచి 9వ తరగతి పరీక్షలు మాత్రమే. ఇవి కూడా పూర్తయితే సమ్మర్ హాలిడేస్ ప్రారంభమవుతాయి. ఇప్పటికే వేసవి సెలవుల తేదీ కోసం విద్యార్థులు ఎదురు చూస్తుండగా ఒంటి పూట బడులు, ఆ తర్వాత కొద్ది రోజులకే పాఠశాలలకు వేసవి సెలవులు రానున్నాయి. వేసవి సెలవుల తేదీలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ జూన్ 12న పాఠశాలలు పునప్రారంభమయ్యే అవకాశం ఉంది.
గమనిక: విద్యార్థులు సెలవుల అంశం ఆయా స్కూల్ యాజమాన్యాలు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాటించాల్సి ఉంటుంది.