
చర్మం అందంగా, యవ్వనంగా కనిపించాలని ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి. ముఖ్యంగా వయసులో చిన్నగా కనిపించాలని చేసే ప్రయత్నాలలోనూ తగ్గడం లేదు. సహజ సౌందర్యం కాకుండా అందంగా కనిపించడం కోసం ఇప్పట్లో బ్యూటీ ట్రీట్మెంట్‌లో భాగంగా చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి అందరికీ అంత సేఫ్ కాదు. ముఖ్యంగా అంత ఖర్చు పెట్టలేని వారు కూడా ఉంటారు. దీనికి తోడు ముప్పై ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించే సమస్య చర్మం వదులుగా మారి వేలాడుతూ కనిపించడం. ముడతలు వంటివి మొదలవుతాయి. ఈ సమస్య తగ్గాలంటే, సరైన స్కిన్ కేర్ పాటించాలి. దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు. మీ చర్మాన్ని బిగుతుగా ఉంచుకునేందుకు ఇంట్లో ఉండే తయారు చేసుకునే మాస్క్ గురించి తెలుసుకోండి.
చర్మకాంతిని కాపాడుకోవడానికి, వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ఏర్పడే వృద్ధాప్య ఛాయలు తగ్గించుకోవడానికి, చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉండటానికి.. సరైన చర్మ సంరక్షణ పాటించాలి. మీరు ఎటువంటి చర్మ సంరక్షణ ను పాటించకపోతే, కాలక్రమేణా బిగుతుగా ఉన్న చర్మం క్రమంగా వేలాడడం ప్రారంభిస్తుంది. అలా కాదు అని అతి జాగ్రత్త తీసుకుని స్కిన్ ట్రీట్మెంట్ ఎక్కువగా తీసుకుంటే, మరో ప్రమాదముంది. ఎక్కువ కెమికల్స్ వాడటం వల్ల ముఖం మరింత పడుతుంది. అలాంటప్పుడు 30 ఏళ్ల తర్వాత స్కిన్ టైటెనింగ్ ఫేస్ మాస్క్‌లు వేసుకోవడం ప్రారంభించాలి. పెద్దగా ఎలాంటి ఖర్చు లేకుండా ఈ మూడు మాస్కులు ఇంట్లోనే తయారు చేసుకుని వాడి చూడండి కచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తారు.. మరి ఇంతకి ఏంటా మాస్క్‌లు అంటే..
1. అరటి పండు ఫేస్ ప్యాక్
ముడతలను తొలగించడం, చర్మాన్ని బిగుతుగా ఉంచాడానికి అరటిపండు చాలా ప్రభావవంతమైన మార్గం. ఇందులో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉండటం వల్ల చర్మం మెరిసిపోతుంది. దీనిని తయారు చేసుకోవడానికి
*పండిన అరటిపండుని గుజ్జుగా చేసుకోవాలి.
*ఆ గుజ్జును ముఖం, మెడ భాగాల్లో అప్లై చేయండి.
అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దీనిని కొద్ది రోజుల పాటు వాడిన తర్వాత చర్మం మృదువుగా అనిపిస్తుంది
2. కీర దోసకాయ
కీర దోసకాయ చర్మానికి ఎంత మంచిదో మనకు తెలిసిందే. ఇందులో ఉండే తేమ, యాంటీ ఏజింగ్ లక్షణాల కారణంగా అనేక చర్మ సంరక్షణ ప్రక్రియలకు చాలా బెస్ట్ ఆప్షన్. విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేసి ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. దీనిని ఉపయోగించడానికి,
* మీడియం సైజు దోసకాయను తురుముకొని.
* ఒక క్లాత్ సాయంతో రసాన్ని పిండండి.
* ఇప్పుడు దోసకాయ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ హిప్ ఆయిల్ వేయండి.
ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో నీటితో కడిగి శుభ్రం చేసుకున్న ముఖానికి అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
3. గుడ్డులోని తెల్లసొన
గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో తేమ ను పెంచుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముడతలు కూడా తక్కువగా కనిపిస్తాయి. మరి దీని ఎలా అప్లై చేయాలి అంటే..
* గుడ్డును పగలగొట్టి, అందులో తెల్లసొనను ఒక గిన్నెలోకి వేరు చేయండి.
* అందులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి గుడ్డులోని తెల్లసొనను మెత్తగా, నురగ గా మారే వరకు బీట్ చేయాలి.
ముఖాన్ని శుభ్రం చేసుకుని, ఆ తర్వాత చర్మంపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తారు.