Eyes: నేటి డిజిటల్ జీవనశైలిలో కంటి అలసట అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. స్క్రీన్‌పై నిరంతరం సమయం గడపడం, తక్కువ వెలుతురులో చదువుకోవడం, కళ్లకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మన కళ్లు త్వరగా అలసిపోతాయి. ఇది చూసే సామర్థ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా తలనొప్పి, కంటి చికాకు వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. కానీ, కొన్ని సులభమైన అలవాట్లను అవలంబించడం ద్వారా మీ కంటి అలసట పోయి ఆరోగ్యంగా ఉంటారు. అవెంటో తెలుసుకుందాం.
1. 20-20-20 నియమం..
మీరు స్క్రీన్‌లపై ఎక్కువ సమయం పని చేస్తే, ప్రతి 20 నిమిషాలకు మీ కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి. 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉంచిన వస్తువును చూడండి. ఇది కళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఉపశమనం కలిగిస్తుంది. కళ్లను తిప్పడం, దూరంగా ఉన్న వస్తువును చూసి రెప్పవేయడం వంటివి క్రమం తప్పకుండా చేయండి. ఈ సాధారణ వ్యాయామాలు కంటి కండరాలను బలోపేతం చేస్తాయి.
2. కంటి ఆరోగ్యానికి..
ఆకుకూరలు, క్యారెట్లు, గుడ్లు, చేపలు, గింజలు తినడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వీటిలో ఉండే విటమిన్ ఎ, సి, ఇ, జింక్ కంటి చూపును కాపాడుకోవడంలో సహాయపడతాయి.
3. బ్లూ లైట్ ఫిల్టర్ :
మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల వంటి పరికరాల నుండి వెలువడే బ్లూ లైట్ కళ్ళకు హాని కలిగిస్తుంది. దీని కోసం, యాంటీ గ్లేర్ గ్లాసెస్ ధరించండి లేదా బ్లూ లైట్ ఫిల్టర్ ఉపయోగించండి.
4. 7-8 నిద్ర..
కళ్లకు విశ్రాంతి ఇవ్వాలంటే రాత్రిపూట 7-8 గంటల పాటు నిద్రపోవాలి. తగినంత నిద్ర కంటి అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది.
5. కళ్లను నీళ్లతో కడుక్కోవాలి:
రోజుకు రెండు మూడు సార్లు చల్లని నీటితో కళ్లను కడగాలి. దీంతో అలసట తగ్గడమే కాకుండా కళ్లు తాజాగా ఉంటాయి.
6. లైటింగ్ పట్ల శ్రద్ధ వహించండి:
చదువుతున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు తగినంత వెలుతురులో కూర్చోండి. తక్కువ వెలుతురులో పనిచేయడం వల్ల కళ్లపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)