Excessive Temperatures AP: ఠారెత్తిస్తున్న ఎండలు

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 28 , 2025 | 03:39 AM

గత గురువారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ మరియు వడగాల్పుల తీవ్రత కొనసాగింది. విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారంలో 89 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, శనివారంలో 230 మండలాల్లో వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది

High Temperatures AP: ఠారెత్తిస్తున్న ఎండలు

  • ప్రకాశంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత

  • నేడు, రేపు తీవ్ర వడగాడ్పులు

అమరావతి, విశాఖపట్నం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గురువారం ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగింది. ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2, కడప జిల్లా ఒంటిమిట్టలో 42.1, కర్నూలులో 41.7, మన్యం జిల్లా సీతంపేటలో 41.4, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.3, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని 89 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని, శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు 208 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శనివారం 230 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date – Mar 28 , 2025 | 03:40 AM

Google News

Subscribe for notification
Verified by MonsterInsights