Excessive Courtroom: బండి సంజయ్‌పై కేసు కొట్టివేత

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 21 , 2025 | 04:55 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల సందర్భంగా సమాజంలోని వివిధ వర్గాల మధ్య మత విద్వేషా లు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారని పేర్కొంటూ అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది.

High Court: బండి సంజయ్‌పై కేసు కొట్టివేత

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసు

  • మత విద్వేష ప్రసంగాలు చేశారంటూ అప్పట్లో ఫిర్యాదు

  • ఎలాంటి ఆధారాలు లేవని.. కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల సందర్భంగా సమాజంలోని వివిధ వర్గాల మధ్య మత విద్వేషా లు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారని పేర్కొంటూ అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఆ ఎన్నికల సందర్భంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌గా వ్యవహరించిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ మారుతి ఫిర్యాదు మేరకు మార్కెట్‌ పోలీ్‌సస్టేషన్‌లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టేయాలని బండి సంజయ్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జే ప్రభాకర్‌ వాదిస్తూ.. ఘటన జరిగిన తర్వాత మూడు రోజులకు కేసు నమోదు చేశారని.. కేసు నమోదు చేయడంలో తీవ్రఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. మొదట ఇచ్చిన సాక్షుల వాంగ్మూలాలకు తర్వాత మరిన్ని విషయాలు జోడించారని ఆరోపించారు. బండి సంజయ్‌ రెచ్చగొట్టేలా ప్రసంగించినట్లు ఆధారాలు లేవన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కేసుల కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.

Updated Date – Mar 21 , 2025 | 04:55 AM

Google News

Subscribe for notification