Excessive Courtroom: అధికార పరిధి దాటి వ్యవహరించారు

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 22 , 2025 | 04:37 AM

వాటిని సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ డివిజనల్‌ ఆఫీసర్‌ చర్య అధికార పరిధి దాటి వ్యవహరించడమేనని వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలను అనుమతించబోమని పేర్కొంది.

High Court: అధికార పరిధి దాటి వ్యవహరించారు

రంపచోడవరం డివిజనల్‌ ఆఫీసర్‌ ప్రొసీడింగ్స్‌పై హైకోర్టు ఆక్షేపణ

ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ పరిధిలోని డివిజనల్‌ ఆఫీసర్‌ కోర్టులలో ప్రాక్టీస్‌ చేసేందుకు కాంపిటెంట్‌ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాలంటూ రంపచోడవరం ఏజెన్సీ డివిజనల్‌ ఆఫీసర్‌/సబ్‌ కలెక్టర్‌ ఈనెల 7న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వాటిని సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ డివిజనల్‌ ఆఫీసర్‌ చర్య అధికార పరిధి దాటి వ్యవహరించడమేనని వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలను అనుమతించబోమని పేర్కొంది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్‌, అల్లూరి జిల్లా కలెక్టర్‌, రంపచోడవరం సబ్‌కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఏజెన్సీ పరిధిలోని డివిజనల్‌ ఆఫీసర్‌ కోర్టులలో ప్రాక్టీస్‌ చేసేందుకు కాంపిటెంట్‌ అథారిటీ నుంచి అనుమతి తీసుకోకుంటే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామంటూ రంపచోడవరం ఏజెన్సీ డివిజనల్‌ ఆఫీసర్‌ ఈ నెల 7న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్‌ చేస్తూ అడ్వొకేట్‌ వెంకట రత్న ప్రకాశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎన్‌.శివారెడ్డి వాదనలు వినిపించారు.

ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date – Mar 22 , 2025 | 04:37 AM

Google News

Subscribe for notification