- హైదరాబాద్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది
- వీసా గడువు తీరిన చాలా మంది ఉన్నారు
- వీరందరిని వెంటనే వెనక్కి పంపి వేయాలి
- వీరి ఏరివేతకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి

హైదరాబాద్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. వీసా గడువు తీరిన చాలా మంది బంగ్లా, పాక్ దేశస్థులు హైదరాబాద్‌లో ఉన్నారన్నారు. వీరందరిని వెంటనే వెనక్కి పంపి వేయాలని డిమాండ్ చేశారు. వీరి ఏరివేతకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో రుజువైందని.. స్లీపర్ సెల్స్ కు హైదరాబాద్ ఎంపీ మద్దతు ఉందని ఆరోపించారు.
READ MORE: CM Chandrababu: రేపు ఏపీ సీఎం హస్తిన బాట.. సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ
దీంతో పాటు బీఆర్ఎస్ ఉత్సవాలపై కూడా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడారు. “బీఆర్‌ఎస్ ఏం సాధించిందని ఉత్సవాలు జరుపుతున్నారు?యువరాజుకి పట్టం కట్టేందుకు ఉత్సవాలు చేస్తున్నారా? బీర్‌ఆర్‌ఎస్ రూలింగ్ లోనే కాదు… ప్రతిపక్షంలో కూడా ఫెయిలైన పార్టీ. బీఆర్ఎస్ కు సేనాధిపతి తిరుగుబాటు తప్పదు. మిషన్ కోసం ఏర్పాటు చేసిన పార్టీ కమీషన్‌లు తీసుకుంది. నాలుగు కోట్ల మంది కొరకు పార్టీ అని ఒక్క కుటుంబానికే పరిమితం చేశారు. బీఆర్‌ఎస్‌కు ఉత్సవాలు జరుపుకునే అర్హత లేదు.” అని మండిపడ్డారు.
READ MORE: CM Chandrababu: రేపు ఏపీ సీఎం హస్తిన బాట.. సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ