- కేసీఆర్ అంటే నాకు గౌరవం
- పరిపూర్ణత చెందిన నాయకుడు
- పదేళ్లు సీఎంగా పని చేశారు
- చాలా అనుభవజ్ఞులు కానీ..
- మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు

మాజీ సీఎం కేసీఆర్‌పై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్ అంటే నాకు గౌరవం. పరిపూర్ణత చెందిన నాయకుడి అని నేను భావిస్తా. కేసీఆర్ పదేళ్లు సీఎంగా పని చేశారు… చాలా అనుభవజ్ఞులు” అని జగ్గారెడ్డి అన్నారు. కానీ.. గాంధీ కుటుంబంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి భయానికే కేసీఆర్ అసెంబ్లీకి పోవడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్‌ను కడిగేస్తాడు అని భయం పట్టుకుందన్నారు. అది తప్పించుకోవడానికి అసెంబ్లీకి పోవడం లేదన్నారు. రేవంత్, కేసీఆర్ సభలో ఎదురు పడండి తెలంగాణ శాసనసభ ఎట్లా ఉంటాదొ చూద్దాని సవాల్ విసిరారు. నిన్న రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. గాంధీ కుటుంబం కోసం నెలలు నెలలు వెయిట్ చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చే వరకు గాంధీ కుటుంబం హీరో అని కొనియాడారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత డబ్లికేట్ గాంధీలు అయ్యారా? అని ప్రశ్నించారు. ప్రజల పట్ల కాంగ్రెస్ హీరో అని.. ప్రతిపక్షానికి విలన్ అన్నారు. బీఆర్ఎస్ ఉనికి కాపాడుకునే పనిలో సభలో జరిగిందన్నారు.. కేసీఆర్ పదేళ్లు సీఎంగా పని చేశారు… చాలా అనుభవజ్ఞులని జగ్గారెడ్డి అన్నారు.
READ MORE: TGPSC: గ్రూప్-1 అభ్యర్థుల నియామకంపై హైకోర్టు స్టే.. టీజీపీఎస్సీ కీలక నిర్ణయం..
ఇప్పుడు గతాన్ని మర్చిపోయి మాట్లాడారని.. డుబ్లికెట్ గాంధీలు అనడం ఆశ్చర్యం అనిపించిందని జగ్గారెడ్డి చెప్పారు. కేసీఆర్ తెలంగాణ నినాదం నుంచి వెనక్కి తగ్గాలని అనుకున్న సమయంలో ఆయన్ని లేపింది కాంగ్రెస్ నేతలే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరగాలి అని మా పార్టీ నేతలే వెనక నిలబడి నడిపించారన్నారు. “కాంగ్రెస్ నాయకత్వం వెనకాల లేకుంటే కేసీఆర్ దీక్ష జరిగేది కాదు.. ఇది వాస్తవం విమర్శ కోసం చెప్పడం లేదు. రాహుల్ గాంధీ పై కేసీఆర్ మాట జారాడు. మీ మాట పై మీకే విలువ లేదా..? సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అని చెప్పింది నువ్వే కదా..? రాహుల్ గాంధీ తెలంగాణ ఇచ్చేయండి అని చెప్పిన తర్వాతే … ప్రక్రియ మొదలైంది. అప్పుడేమో.. రాహుల్..సోనియా గాంధీ దేవుళ్ళు అన్నావు. ఇప్పుడు కేసీఆర్ కడుపు నిండి ఉన్నది కాబట్టి దయ్యాలు అయ్యారా ఇవాళ. కేసీఆర్ అనవసరంగా మాట తూలుతున్నారు. నీ పార్టీకి నువ్వు ఎట్లా ప్రచారం చేశావో.. మా పార్టీకి రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలి. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ అంటే నాకు గౌరవం. పరిపూర్ణత చెందిన నాయకుడి అని నేను భావిస్తా. కానీ ఈ వయసులో ఇంత దిగజారి మాట్లాడుడు అవసరమా..? ఎథిక్స్ తో రాజకీయాల్లో ఉన్న కుటుంబం కేవలం రాహుల్ గాంధీ కుటుంబమే. బ్రిటిష్ పాలన లో కూడా లక్షల కోట్లు ఆస్తులు ధారాదత్తం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం. బీఆర్ఎస్ ఢిల్లీకి సంచులు మోయలేదా..? ఢిల్లీ.. ఒరిస్సా.. పంజాబ్.. కర్ణాటక.. తమిళనాడు.. డబ్బులు పంపింది నువ్వు కాదా..? ఆరేడు రాష్ట్రాలకు సంచులు పంపింది కేసీఆర్ కాదా..?” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.