ఎంజీ విండ్సర్ ఈవీ సెప్టెంబర్ 2024లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. టాటా నెక్సాన్ ఈవీ అధిగమించి తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం విండ్సర్ ఈవీ 37.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంది. ఈ కారు 331 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అయితే తాజాగా ఎంజీ విండ్సర్ 50 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఎంపికను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ నెలలో అంటే ఏప్రిల్ 2025లో ప్రారంభించాలని భావిస్తున్న ఈ లాంగ్-రేంజ్ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 460 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంది.
హ్యుందాయ్ భారత మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ వంటి వాటికి పోటీగా కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీను లాంచ్ చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు తక్కువగా ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వెన్యూ 2025 చివరి నాటికి దేశంలో విడుదల కానున్న నెక్స్ట్-జెన్ ఐసీఈ వెన్యూ ఆధారంగా ఉంటుందని భావిస్తున్నారు. వెన్యూ ఈవీ బహుశా ఈ-జీఎంపీ(కే) ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పని చేస్తుంది. ఇది రాబోయే ఇన్‌స్టర్ ఆధారిత ఈవీ కోసం కూడా ఉపయోగించే ఉంది. అయితే ఈ కారు గురించి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వెన్యూ EV ఒకే చార్జ్‌పై దాదాపు 400 కిలోమీటర్ల క్లెయిమ్ రేంజ్‌తో వస్తుందని నిపుణులు అంచనా వేస్తుంది.
కియా ఫిబ్రవరి 2025లో భారత మార్కెట్లో సైరోస్‌ను ప్రారంభించింది. ఈ సంవత్సరం చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. సైరోస్ ఈవీ అప్‌డేటెడ్ బంపర్లు, కొత్త ఏరో-ఎఫిషియన్సీ అల్లాయ్ వీల్స్, కొన్ని ఈవీ -నిర్దిష్ట బ్రాండింగ్‌లను పొందుతుందని అంచనా వేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ వివరాలు రహస్యంగా ఉంచినప్పటికీ సైరోస్ ఈవీను ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్‌తో వచ్చే అవకాశం ఉంది. కియా సైరోస్ ఈవీ టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ వంటి వాటికి పోటీనిస్తుంది.
ఇవి కూడా చదవండి
2023 టోక్యో మోటార్ షోలో సుజుకి ఈ ఈడబ్ల్యూఎక్స్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. భారతదేశంలో మారుతి సుజుకీ ఈడబ్ల్యూఎక్స్ ఆధారంగా కొత్త చిన్న ఈవీని విడుదల చేయనుంది. 2024లో దేశంలో ఈడబ్ల్యూఎక్స్ కోసం డిజైన్ పేటెంట్ దాఖలు చేసింది. ఈ కారున 2026-2027 సంవత్సరంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కారు మరిన్ని వివరాలు అందుబాటులో లేనప్పటికీ ఈడబ్ల్యూఎక్స్ ఆధారిత ఈవీ ఒకే ఛార్జ్‌పై దాదాపు 250 కిలోమీటర్ల పరిధితో వస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..