పీఎఫ్ ఉద్యోగులకు ఓ సరికొత్త గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా ప్రవేశపెట్టిన కొత్త విధానం ఉద్యోగులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇప్పటి వరకు, యూనివర్సల్ ప్రావిడెంట్ ఫండ్ (UAN) నంబర్‌ని పొందడానికి ఉద్యోగులు తమ సంస్థల సహాయాన్ని కోరుకునే అవసరం ఉండేది.
కానీ ఈ కొత్త ఫీచర్ ద్వారా, ఇప్పుడు ఉద్యోగులు తమ ఫేస్ అథెంటికేషన్ ద్వారా స్వయంగా తమ UAN నంబర్‌ని జనరేట్ చేసుకొని, ఎటువంటి ఆటంకం లేకుండా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది ఉద్యోగులకు ఒక కొత్త స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. ఎక్కడైతే ఉన్నా ఇబ్బంది లేకుండా, సురక్షితమైన విధానంలో UAN నంబర్ పొందవచ్చు. ఈ మార్పు ద్వారా, ఉద్యోగులు మరింత వేగంగా, సులభంగా తమ ప్రావిడెంట్ ఫండ్ ప్రక్రియను నిర్వహించుకోవచ్చు.
UAN అంటే ఏమిటి
యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది 12 అంకెల ప్రత్యేక సంఖ్య. ఇది EPFO ద్వారా ప్రతి సభ్యుడికి కేటాయించబడుతుంది. UAN ద్వారా, ఉద్యోగులు తమ PF ఖాతాలను సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు. దీని ద్వారా వివిధ రకాల సేవలను పొందవచ్చు. ఉదాహరణకు, PF బ్యాలెన్స్ చెక్ చేయడం, డబ్బును ఉపసంహరించుకోవడం వంటి సేవలను పొందవచ్చు.
ఫేస్ అథెంటికేషన్ ద్వారా UAN జనరేషన్, యాక్టివేషన్
ఉద్యోగులు ఇప్పుడు UMANG మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి తమ UANను సులభంగా జనరేట్, యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది ఆధార్ ఆధారిత ధృవీకరణను ఉపయోగించి, పూర్తి డిజిటల్ విధానంలో జరుగుతుంది. అయితే దీనిని ఎలా చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాసెస్ ఎలాగంటే
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి.
తర్వాత యాప్‌ను తెరిచి, EPFO సేవలను ఎంచుకోండి
ఫేస్ అథెంటికేషన్ ద్వారా లాగిన్ అవ్వండి. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా మీ వివరాలను ధృవీకరించండి
UAN జనరేషన్, యాక్టివేషన్ ఆప్షన్ ఎంచుకోండి.
అక్కడ మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి. ఉదాహరణకు పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు
ఆ తర్వాత ఆధార్ ఆధారిత ధృవీకరణను పూర్తి చేయండి
ధృవీకరణ తర్వాత, మీ UAN నంబర్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా అందుతుంది
UAN యాక్టివేషన్ చేయడం:
UAN పొందిన తర్వాత, దాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా EPFO సేవలను పొందవచ్చు.
అందుకోసం EPFO వెబ్‌సైట్ www.epfindia.gov.inని సందర్శించండి
అక్కడ UAN యాక్టివేషన్’ పేజీకి వెళ్లండి. ‘సర్వీసెస్’ ట్యాబ్‌లో ‘ఉద్యోగుల కోసం’ ఆప్షన్ ఎంచుకుని, ‘సభ్యుల UAN / ఆన్‌లైన్ సర్వీసెస్’పై క్లిక్ చేయండి.
మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి. UAN, ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయండి
ఆ క్రమంలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPను నమోదు చేసి ధృవీకరించండి.
ధృవీకరణ తర్వాత, మీ UAN యాక్టివేట్ అవుతుంది
ఇవి కూడా చదవండి:
Gold Price Fluctuations: అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది..కారణాలేంటి
Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Read More Business News and Latest Telugu News