దేశ దిశ

Entrance Examination: ఆలిండియా సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాలు

Entrance Examination: ఆలిండియా సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాలు

దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో ఆరోతరగతి, తొమ్మిదోతరగతి ప్రవేశాలకు ఉద్దేశించిన ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎ్‌సఎ్‌సఈఈ) 2024 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పరీక్షని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. సైనిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ఇవి సీబీఎ్‌సఈ గుర్తింపు ఉన్న రెసిడెన్షియల్‌ స్కూళ్లు. ఆరోతరగతిలో బాలికలు కూడా చేరవచ్చు. తొమ్మిదోతరగతిలో ప్రవేశానికి బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సైనిక పాఠశాలల పరిధుల్లోని స్థానిక విద్యార్థులకు 67 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 33 శాతం సీట్లకు ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పోటీపడవచ్చు. ప్రతి సైనిక పాఠశాలలో ఆరోతరగతిలో 10 శాతం/గరిష్ఠంగా 10 సీట్లను బాలికలకు ప్రత్యేకించారు. ఎన్‌జీఓలు/ప్రైవేట్‌ పాఠశాలలు/రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 19 నూతన సైనిక పాఠశాలల్లో కూడా ఈ నోటిఫికేషన్‌ ద్వారానే ఆరోతరగతి అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు. సైనిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ తదితరాల్లో చేరేందుకు సన్నద్ధం చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో సైనిక పాఠశాలలు-సీట్లు

అర్హత వివరాలు

ఏఐఎ్‌సఎ్‌సఈఈ వివరాలు

ఆరోతరగతి ఎంట్రెన్స్‌ వివరాలు

తొమ్మిదోతరగతి ఎంట్రెన్స్‌ వివరాలు

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు, డిఫెన్స్‌ ఉద్యోగుల పిల్లలకు, ఎక్స్‌ సర్వీస్‌మన్‌ పిల్లలకు, ఓబీసీ అభ్యర్థులకు రూ.650; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 16

కరెక్షన్‌ విండో ఓపెన్‌: డిసెంబరు 18 నుంచి 20 వరకు

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం

ఏఐఎ్‌సఎ్‌సఈఈ తేదీ: 2024 జనవరి 21

వెబ్‌సైట్‌: https://exams.nta.ac.in/AISSEE

Exit mobile version