ABN
, Publish Date – May 24 , 2024 | 04:34 PM
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్(Engineering Counseling Schedule)ను తెలంగాణ ఈఏపీ సెట్(TGEAPSET)కమిటీ విడుదల చేసింది. జూన్ 27నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మెుదలు కానున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్(Engineering Counseling Schedule)ను తెలంగాణ ఈఏపీ సెట్(TGEAPSET)కమిటీ విడుదల చేసింది. జూన్ 27నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ మెుదలు కానున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 30నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించింది. జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు చేయనున్నారు. జులై 19నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జులై 24న ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు చేపట్టగా… జులై 30 నుంచి ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభిస్తారు. ఆగస్టు 5న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు జరగనున్నట్లు టీజీ ఈఏపీ సెట్ కమిటీ పేర్కొంది.
For More Telangana News and Telugu News..
Updated Date – May 24 , 2024 | 04:34 PM