- ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
- పలువురు మావోల హతం!

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భద్రతా దళాలకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్-దంతేవాడ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు-మావోల మధ్య ఎదురుగాల్పులు జరుగుతున్నాయి. అయితే ఈ ఘటనలో పలువురు మావోలు చనిపోయినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావల్సి ఉంది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బీజాపూర్ పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Fake Baba: నిమ్మకాయల్లో మత్తమందు.. స్పృహ కోల్పోయాక అత్యాచారం
ఇదిలా ఉంటే నారాయణపూర్ జిల్లా అబుజ్మద్‌లో మావోలు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ పేలుడు కారణంగా ఒక జవాన్, ఒక అధికారి కళ్లలోకి దుమ్ము, బురద వెళ్లినట్లుగా తెలిపారు. చికిత్స కోసం వారిని వేరే ప్రాంతానికి తరలించారు. అయితే ఈ పేలుడులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గాలింపు జరుగుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్‌కు భారతరత్న ఇవ్వాలి.. బెంగాల్ సీఎం డిమాండ్