దేశ దిశ

Encounter between safety forces and terrorists in Kulgam..

Encounter between safety forces and terrorists in Kulgam..

  • పహల్గామ్ దాడి తర్వాత రోజే కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్..
  • టీఆర్ఎఫ్ కీలక కమాండర్ చిక్కుకున్నట్లు సమాచారం..
Encounter between safety forces and terrorists in Kulgam..

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగి ఉగ్రదాడి యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. అమాయకులైన పర్యాటకులు, ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) బాధ్యత ప్రకటించింది. ఈ దాడిలో 20కి పైగా మంది మరణించారు. ఈ విషాద ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని దేశం మొత్తం కోరుతోంది. మరోవైపు, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్రం ప్రభుత్వం అత్యు్న్నత సమావేశాన్ని నిర్వహిస్తోంది.

Read Also: Pakistan: భారీగా పాకిస్తాన్ సైన్యం మోహరింపు.. సరిహద్దు గ్రామాలు ఖాళీ..

ఇదిలా ఉంటే, భయంకరమైన ఉగ్రదాడి జరిగిన తర్వాత రోజు బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) యొక్క టాప్ కమాండర్ చిక్కుకున్నాడు. ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్మార్గ్ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున, భారత సైన్యం ఇద్దరు ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసి, వారిని మట్టుపెట్టింది. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని, పాక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version