
వేసవిలో విపరీతంగా కాసే ఎండలు ఎలక్ట్రిక్ సైకిల్ పై విపరీతమైన ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వీటి బ్యాటరీలు చాలా సున్నితంగా ఉంటాయి. ఎండకు అవి పాడైపోయే ప్రమాదం ఉంది. బయట వేడిగా ఉన్నప్పుడు బ్యాటరీ ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి ఎండ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్ దూరంగా ఉంచాలి. బయట రైడింగ్ చేస్తున్నప్పుడు ఆపాల్సి వస్తే చెట్టు నీడన పార్క్ చేయాలి. పగటపూట చల్లగా ఉన్న సమయంలో, లేదా రాత్రి సమయంలోనే బ్యాటరీని చార్జింగ్ చేయాలి. బ్యాటరీ తయారుదారు చేసిన సిఫారసులను అనుసరించండి. ఎండ సమయంలో ప్రయాణం చేస్తే టైర్లపై కూడా ఎక్కువ ప్రభావం పడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మకమైన టైర్ ప్రెజర్ గేజ్ తో మీ టైర్ ప్రెజర్ ను తరచూ కొలవాలి. వేసవిలో ఎక్కువ సేపు ప్రయాణించడం వల్ల టైర్లు త్వరగా అరిగిపోతాయి.
వేసవి కాలంలో బ్రేక్ ల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు వాటి పనితీరులో తేడాలొస్తాయి. వేడి కారణంగా బ్రేక్ ప్యాడ్లు త్వరగా అరిగిపోతాయి. మీ సైకిల్ ను సమర్థంగా ఆపగల సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి ప్యాడ్లు, డిస్క్ లను తరచూ తనిఖీ చేయాలి. అవి సన్నబడిపోతుంటే వెంటనే మార్చాలి. ఎలక్ట్రిక్ సైకిల్ కు మోటారు చాలా ముఖ్యమైనది. ఎండల సమయంలో దీనిపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మోటారు వేడెక్కితే అనేక అనర్థాలు కలుగుతాయి. సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు శాశ్వత నష్టం కలిగించే ప్రమాదం ఉంది. దీనితో పాటు సైకిల్ విద్యుత్ వ్యవస్థ చాలా కీలకం. తీవ్రమైన వేడి దీని పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి వైర్లను తరచూ గుర్తించి మరమ్మతులు చేయాలి.
సైకిల్ ప్రేమ్, ఇతర భాగాలు కూడా ఎండల ప్రభావానికి గురవుతాయి. ఎండ కారణంగా ప్రేమ్ పై కోటింగ్ బాగుండాలంటే ప్రత్యేకంగా రూపొందించిన క్లీనింగ్ ఉత్పత్తులను వినియోగించాలి. సైకిల్ ను నీడ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్ చేయాలి. వేడి గాలుల నుంచి రక్షణకు దానిపై కవర్ కప్పాలి. తెల్లవారుజామున, సాయంత్రం సమయంలో రైడింగ్ చేయాలి. దీనివల్ల మీకు, మీ వాహనానికి ఉపయోగంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి