ED Raids: సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో రెండోసారి ఈడీ సోదాలు..

Written by RAJU

Published on:

హైదరాబాద్: నగరంలో ఈడీ (Enforcement Directorate) దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. సురానా (Surana), సాయి సూర్య డెవలపర్స్‌ (Sai Surya Developers)లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్ (Secunderabad), బోయిన్ పల్లి (Boyinapalli), జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) మాదాపూర్‌ (Madaoyr)లో సురానా గ్రూప్ ఛైర్మన్, ఎండీ డైరెక్టర్ ఇల్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సునారా గ్రూప్ మూడు బ్యాంకులకు రూ. 3,986 కోట్లు ఎగ్గొట్టింది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంపై సీబీఐ (CBI) మూడు కేసులు నమోదు చేసింది. సురానాకు అనుబంధంగా సాయిసూర్య డెవలపర్స్ పనిచేస్తోంది. 2021 ఫిబ్రవరిలో సురానా కంపెనీలో జరిగిన ఈడీ సోదాల్లో రూ. 11 కోట్ల 62 లక్షల విలువైన బంగారం, నగదు సీజ్ చేశారు. సురానా గ్రూప్ అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ కేసు కూడా నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాడులు చేశారు.

Also Read..: ఆంధ్రావాసికి శబరిమల తొలి గోల్డ్ లాకెట్..

రెండోసారి ఈడీ సోదాలు..

సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌‌లో ఎన్‌ఫోర్స్‌నమెంట్ డైరక్టరేట్ అధికారులు రెండోసారి సోదాలు చేస్తున్నారు. సురానా ఇండస్ట్రీస్ లిమిటెడ్, M/s సురానా కార్పొరేషన్ లిమిటెడ్, M/s సురానా పవర్ లిమిటెడ్, కంపెనీల ఇద్దరు ప్రమోటర్లు, ఇతర అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో కంపెనీ ఎండి దినేష్ చంద్ సురానా, విజయ్ రాజ్ సురానా, డమ్మీ డైరెక్టర్లు ఆనంద్ ప్రభాకరన్‌లను 2022లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా మరోసారి సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 3,986 కోట్లు సురానా గ్రూప్ కుచ్చుటోపి పెట్టింది. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో మొండి బకాయిలుగా కంపెనీ మారింది. బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడంపై బెంగళూర్ సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది.

గతంలో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన రూ.113.32 కోట్ల విలువైన స్థిరచరాస్తులను తాత్కాలికంగా ఈడీ అధికారులు జప్తు చేశారు. తమ బంధువులు, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉద్యోగులను డైరెక్టర్లుగా నియమించి దినేష్ చంద్ సురానా బ్యాంకులను మోసం చేశారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నారు. సురానా గ్రూప్ కేమన్ ఐలాండ్‌తో పాటు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లలో డమ్మీ డైరెక్టర్లను నియామకం చేసి.. ఆయా కంపెనీల్లోకి బ్యాంకు రుణాలను సురానా మళ్లించారు. సింగపూర్‌లో నాలుగు కంపెనీలు స్థాపించి వస్తువుల ఎగుమతి చేసి ఆ డబ్బును సురానా భారతదేశంలో అందుకున్నారు. దారి మళ్లించిన నిధులలో కొంత భాగాన్ని వివిధ బినామీ, కంపెనీల పేర్లలో చరాస్తులు, స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్టు ఈడీ అధికారులు నిర్ధారించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీలో అలకలు.. అసంతృప్తులు..

పబ్లిసిటీ కోసం వెళ్లి.. కటకటాల్లోకి…

For More AP News and Telugu News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights