Ear Infections in Children: పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు.. వారికి ఎలా చికిత్స చేయాలి..

Written by RAJU

Published on:

Ear Infections in Children: పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు రావడం సాధారణం. చెవి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు నిరంతరం చెవి నొప్పి, చెవిలో గులిమి వంటి సమస్యలు వస్తాయి. ఇవి భరించలేని నొప్పిని కలిగిస్తాయి. అంతేకాకుండా జ్వరానికి కూడా దారితీస్తుంది. కాబట్టి, పిల్లలకు సరైన చికిత్స అందించడం చాలా ముఖ్యం. అయితే, చెవి ఇన్ఫెక్షన్లను వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తల్లిపాలు ..

బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శిశువును చెవి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

టీకాలు ..

చెవి ఇన్ఫెక్షన్లను నివారించడానికి పిల్లలకు టీకాలు వేయవచ్చు. న్యూమోనియా మెనింజైటిస్ వల్ల కలిగే చెవి ఇన్ఫెక్షన్లను నివారించడానికి టీకాలు సహాయపడతాయి.

సురక్షితమైన చికిత్స

చెవి ఇన్ఫెక్షన్లు ఉన్న పిల్లలకు సురక్షితమైన చికిత్స అందించడం చాలా ముఖ్యం. దాదాపు 80% చెవి ఇన్ఫెక్షన్లు మందులు లేకుండానే తగ్గిపోతాయి.

యాంటీబయాటిక్ క్రీములు

వైద్యులు సూచించిన యాంటీబయాటిక్ క్రీములను చెవులకు ఉపయోగించవచ్చు. చెవి ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే లక్షణాలను తగ్గించడానికి ఈ మందులను ఉపయోగిస్తారు.

చెవి నొప్పి నివారణ మందులు

కొన్నిసార్లు చెవి ఇన్ఫెక్షన్లు భరించలేని నొప్పిని కలిగిస్తాయి. జ్వరానికి కూడా దారితీస్తాయి. చెవి నొప్పిని తగ్గించడానికి ఎసిటమైనోఫెన్ లేదా ఇబుప్రోఫన్ వంటి నొప్పి నివారణ మందులు ఇవ్వవచ్చు. మందులు తీసుకున్న వారం లోపు ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందో లేదో గమనించాలి. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించండి.

నోటి మందులు

చెవి ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉంటే కొన్ని నోటి యాంటీబయాటిక్స్ వాడితే ప్రయోజనం ఉంటుంది. ఇవి నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.

దుష్ప్రభావాలు

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తరచుగా యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. యాంటీబయాటిక్స్ తరచుగా తీసుకోవడం వల్ల వికారం, విరేచనాలు, కడుపు నొప్పి, దద్దుర్లు లేదా మంట వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read: ఈ చిట్కాలు పాటిస్తే వయసు పెరిగినా మీ కంటి చూపు అస్సలు తగ్గదు..

Subscribe for notification