రాష్ట్రంలో ఎంసెట్ పేరు మారిపోయింది. అవును గతంలో తెలంగాణ EAMCETగా పిల్చుకునే పేరును EAPCETగా మార్చారు. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాల్లో విద్యార్థుల ఎంపిక కోసం ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను గతంలో నిర్వహించగా, వాటి ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ(telangana)లో మొదటి సరి జరిగిన EAPCETలో ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతంతో 1,80,424 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఇక ఫార్మసీ విభాగంలో 89.66 శాతంతో 82,163 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్ కేటగిరిలో 74.98%తో 1,80,424 మంది పాస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంక్ సత్యవాడ జ్యోతిర్ ఆదిత్య (155.63) సాధించగా, రెండో ర్యాంక్ గొల్లలేక హర్ష (152.08), మూడో ర్యాంకు రిషి శేఖర్ శుక్ల (150.66) దక్కించుకున్నారు. ఇక అగ్రికల్చర్ విభాగంలో అల్లూరు ప్రణీత (146.44) మార్కులు, రెండు, మూడో ర్యాంకులు రాధాకృష్ణ(145.42), గడ్డం శ్రీవర్షిని 145.42 సాధించారు.
విద్యార్థులు తమ ఫలితాలకు సంబంధించిన ర్యాంక్ కార్డులను టీఎస్‌ఎప్‌సెట్ అధికారిక వెబ్‌సైట్(eapcet.tsche.ac.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రాష్ట్ర స్థాయి పరీక్షను తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీ/ప్రైవేట్ కాలేజీలలో అందించే వివిధ వృత్తిపరమైన కోర్సుల్లో ప్రవేశం కోసం సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
MallaReddy: మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా..? ఎందుకంటే..?
TS News: ధరణి పోర్టల్‌లో మరో 79 తప్పులు..!!
For More Education News and Telugu News..
Updated Date – May 18 , 2024 | 04:06 PM