Dwarka Court docket Receives Bomb Menace

Written by RAJU

Published on:

  • ఢిల్లీలోని ద్వారక కోర్టుకు బాంబు బెదిరింపులు..
  • కోర్టు పరిసరాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు..
  • ఎలాంటి పేలుడు పదర్థాలు దొరకలేదు: పోలీసులు
Dwarka Court docket Receives Bomb Menace

Bomb Threat: భారత్ లో బాంబు బెదిరింపులు పరంపర కొనసాగుతుంది. తాజాగా ఢిల్లీలోని ద్వారకా న్యాయస్థానానికి బాంబు బెదిరింపులే వచ్చాయి. అయితే, మంగళవారం నాడు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ మెయిల్ ద్వారా ఈ హెచ్చరికలు వచ్చినట్లు గుర్తించారు. ఇవాళ ( ఏప్రిల్ 16న ) ఉదయం కోర్టు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు బెదిరింపుల గురించి నేటి ఉదయం 10:45 గంటల సమయంలో పీసీఆర్‌కు కాల్‌ వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ఆవరణకు వచ్చేశారు. అక్కడ ఉన్న జనాన్ని ఖాళీ చేయించి బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో కోర్టు ప్రాంగణం మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

Read Also: National Herald Case: సోనియా, రాహుల్‌పై బీజేపీ ఘాటు విమర్శలు

అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువలూ కనిపించలేదని ద్వారకకు చెందిన పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి లోతైన విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరు భయపడ వద్దు.. కోర్టు పరిసరాల్లో ఎలాంటి పేలుడు పదర్థాలు దొరకలేదని తెలిపారు. దీంతో న్యాయమూర్తితో పాటు లాయర్లు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights