ABN
, Publish Date – Apr 27 , 2025 | 05:25 AM
దుబాయ్‌లో పని చేస్తున్న హుస్నాబాద్‌కు చెందిన చొప్పరి లింగయ్య ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో స్వదేశానికి చేరుకున్నాడు. లింగయ్యకు విమాన టికెట్‌ను ఏర్పాటు చేసి, ఆయనను హుస్నాబాద్‌కు తీసుకురావడం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కృషి ప్రశంసనీయమైంది

హుస్నాబాద్/శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి ఇబ్బందులు పడుతున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన చొప్పరి లింగయ్య ఎట్టకేలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో శనివారం ఇంటికి చేరుకున్నారు. నెల రోజుల క్రితం దుబాయ్ వెళ్లిన లింగయ్య.. తన ఆరోగ్యం క్షిణించిందని, కాళ్లవాపులతో నడువలేక పోతున్నానని, తిరిగి ఇంటికి వెళ్లకుండా కంపెనీ వారు పాస్‌పోర్టు తీసుకున్నారని సెల్ఫీ వీడియో తీసి పంపించారు. తనను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు.
విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం స్పందించి దుబాయ్‌లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్‌ఆర్‌ఐ అడ్వైయిజరీ కమిటీ చైర్మన్ బీఎం వినోద్‌కుమార్, వైస్‌చైర్మన్ మంద భీమ్‌రెడ్డిలను సమన్వయం చేశారు. అక్కడ వారు చొప్పరి లింగయ్య భారత్‌కు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ లింగయ్యకు విమాన టికెట్‌కు డబ్బులు చెల్లించి ఇంటికి తీసుకరావడానికి కృషి చేశారు. శనివారం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన లింగయ్యను ఆయన భార్య రజిత కలుసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్తను ఇంటికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News
Updated Date – Apr 27 , 2025 | 05:25 AM