Dry Prawns: ఎండు రొయ్యలు తింటున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Written by RAJU

Published on:

ఎండు రొయ్యలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, జింక్, అయోడిన్, పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, చాలా మందికి ఎండు రొయ్యలు అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే అవి చాలా ఘాటు వాసన వస్తాయి. కానీ, ఎండు రొయ్యలు ఆహారంగా తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

ఎండు రొయ్యలు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా, సెలీనియం క్యాన్సర్ తో మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎండు రొయ్యల్లోని విటమిన్ బి 12, మెగ్నీషియం మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. ఎండు రొయ్యలు జుట్టును దృఢంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. వారానికోసారి కానీ 15 రోజులకోసారి కానీ ఎండు రొయ్యలు తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఎండు రొయ్యలను తరచూ తినడం వల్ల గుండెకు, చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎండు రొయ్యలను తింటే చర్మ సమస్యలు దూరం అవుతాయి. వీటి లోని విటమిన్స్ చర్మం మెరిసేలా చేస్తుంది. మొత్తంగా ఎండు రొయ్యలను తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి, ఎండు రొయ్యల వాసన చూసి ఛీ..ఛీ అనకుండా నిరభ్యంతరంగా వీటితో కూర తాయారు చేసి కుమ్మేయండి.

Also Read:

Chanakyaniti: ఈ ముగ్గురితో శత్రుత్వం ఏ మాత్రం మంచిది కాదు..

Prathyekam : ఈ చీమ చాలా స్పెషల్ గురూ.. వీటి ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..

Walnuts: ఖాళీ కడుపుతో వాల్‌నట్స్ తింటే 4 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights