- మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్‌లో ఘటన
- శ్రీదేవిని ప్రేమ వివాహం చేసుకొని క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న మహేష్
- గత కొంతకాలంగా తరచూ గొడవపడుతున్న మహేష్, శ్రీదేవి దంపతులు
- నిన్న రాత్రి భార్య శ్రీదేవి తోపాటు అత్తపై కత్తితో దాడి పాల్పడ్డ మహేష్
- మహేష్ దాడిలో గాయాల పాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు

హైదరాబాద్ మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అల్లుడు భార్య, అత్తపై కత్తితో దాడి చేశాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్ లో ఘటన జరిగింది. మహేష్ అనే వ్యక్తి శ్రీదేవిని అనే యువతిని ప్రేమ వివాహం చేసుకొని క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్, శ్రీదేవి దంపతుల మధ్య తరచూ గొడవలు చెలరేగాయి. మహేష్ నిన్న రాత్రి భార్య శ్రీదేవితోపాటు అత్తపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
READ MORE: Latest Release : ఏప్రిల్ 25న రిలీజ్ కు రెడీగా 15 సినిమాలు.. అరడజనుకు పైగా ఊరు, పేరు లేనివే
మహేష్ దాడిలో గాయాల పాలైన ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భార్య శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీదేవి తల్లి మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Aamir Khen : బాలీవుడ్ నుండి మరో భారీ ప్రజెక్ట్.. అదిరి పోయే అప్ డేట్ ఇచ్చిన ఆమిర్ ఖాన్