- తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ 2025 నోటిఫికేషన్ విడుదల
- మూడు విడతల్లో అడ్మిషన్లు
- మొదటి దశకు ఈ నెల 3 నుంచి దరఖాస్తులు
- బకెట్ సిస్టమ్, రిజర్వేషన్లతో ఈసారి ప్రవేశ ప్రక్రియ

DOST 2025: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త! ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కృష్ణ రెడ్డి , కళాశాల విద్యా శాఖ కమిషనర్ శ్రీ దేవ సేన సంయుక్తంగా డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్స్ (దోస్త్) 2025-26 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమం కానుంది. ఈ సందర్భంగా చైర్మన్ బాల కృష్ణ రెడ్డి మాట్లాడుతూ, ఈసారి మూడు విడతల్లో అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. మొదటి దశ అడ్మిషన్ల కోసం ఈ నెల 3వ తేదీ నుండి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
Canabarro Lucas : 116 ఏళ్ల జ్ఞాపకం.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత..
ఆ తర్వాత, ఈ నెల 10వ తేదీ నుండి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఈ సమయంలో ఎంచుకోవచ్చు. మొదటి దశ సీట్ల కేటాయింపు మే 29న జరుగుతుంది. ఇక, మొదటి సెమిస్టర్ తరగతులు జూన్ 30వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 1057 డిగ్రీ కళాశాలలు ఉండగా, వీటిలో 987 కళాశాలలు దోస్త్ పరిధిలోకి వస్తాయి. మిగిలిన 70 కళాశాలలు ఈ ప్రక్రియలో పాల్గొనవు. ఈసారి ప్రవేశాల ప్రక్రియలో బకెట్ సిస్టమ్ ఉంటుందని చైర్మన్ తెలిపారు. అంతేకాకుండా, ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయబడతాయి. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,67,456 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
HYDRA Police Station : హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి