ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ వ్యాయామం చేయడం ఎంతో అవసరం. ఫిట్‌నెస్ విషయంలో శ్రద్ధ వహించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. క్రమం తప్పకుండా వర్కవుట్లు చేయడం వల్ల హానికర టాక్సిన్లు చెమట రూపంలో బయటకు వెళ్లిపోయి శరీరం తేలికగా, అద్భుతంగా అనిపిస్తుంది. బరువు అదుపులోకి వచ్చి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. మెదటు ఉత్తేజితమై శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు. ఇలా ఎన్నో రకాలుగా మేలు చేకూరుస్తుంది వ్యాయామం. అయితే, వర్కవుట్లు చేసే ముందు ఈ తప్పు మాత్రం అస్సలు చేయకండి. ఆరోగ్యం సంగతి అటుంచితే.. కొన్ని నిమిషాల్లోనే గుండెపోటు వచ్చి ప్రాణాలే ఎగిరిపోగలవు. అమెరికాలో ఓ 20 ఏళ్ల యువతి కూడా ఇలాగే చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. సో బీ కేర్‌ఫుల్.. ఇలా జరగకూడదంటే ఆ తప్పు ఏంటో తెలుసుకోండి.
వర్కవుట్‌కు ముందు ఇది తాగి.. సెకన్లలోనే గుండెపోటు తెచ్చుకుంది..
అమెరికాలో జాజ్మిన్ గార్జా అనే ఓ 20 ఏళ్ల అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్ చేసే ముందు బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ ప్రసిద్ధ ఎనర్జీ డ్రింక్ తాగింది. వెయిట్ లిఫ్టింగ్ చేయడం మొదలుపెట్టిన కొన్ని క్షణాల్లోనే అకస్మాత్తుగా నేల మీద పడిపోయింది. ముక్కు నుంచి రక్తం కారి సెకన్లలోనే నాడి కొట్టుకోవడం ఆగిపోయింది. వైద్యులు వచ్చేలోపే బాయ్‌ఫ్రెండ్ CPR ఇవ్వడంతో ప్రాణాలతో బయటపడగలిగింది. ఎనర్జీ డ్రింక్స్ లో 150-300 మి.గ్రా కెఫీన్ ఉంటుంది. వర్కవుట్లు చేసే ముందు ఇవి తాగితే హృదయ స్పందన రేటు, రక్తపోటు వేగవంతం అయ్యి గుండెకు ఆక్సిజన్ చేరకుండా నిరోధిస్తుంది. కొన్ని క్షణాల్లోనే గుండెపోటు వచ్చేలా చేస్తుంది. ఇదొక్కటే కాదు. వ్యాయామం చేసే ముందు ఈ కింద పొరపాట్లు చేయకుండా జాగ్రత్త వహించండి.
వ్యాయామానికి ముందు చేయకూడనివి..
1. భోజనం : కడుపు నిండా భోజనం తిన్నాక వర్కవుట్ల జోలికి కనీసం 2-3 గంటల వరకూ వెళ్లకండి. ఇలా చేస్తే భోజనం అజీర్ణం కాదు కాబట్టి శరీరంలో అసౌకర్యానికి గురై ఏమైనా జరగవచ్చు.
2. కెఫీన్, నికోటిన్ : వ్యాయామానికి కనీసం 2 గంటల ముందు కెఫీన్, నికోటిన్ తీసుకోవడం మానేయండి. ఎందుకంటే ఇవి వణుకు, డీ హైడ్రేషన్‌కి కారణమవుతాయి.
3. నీరు : హైడ్రేషన్ తప్పనిసరి అయినప్పటికీ ఎక్కువ నీరు త్రాగడం వల్ల కడుపులో అసౌకర్యం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది.
4. ఎలక్ట్రానిక్ పరికరాలు : బ్లూ లైట్ వల్ల వ్యాయామం చేసేటప్పుడు ఏకాగ్రత లోపిస్తుంది. పరధ్యానం తగ్గించుకోవడానికి వర్కవుట్లకు కనీసం 30 నిమిషాలు స్క్రీన్‌లను నివారించండి.
5. బిగుతుగా లేదా అసౌకర్యంగా ఉండే దుస్తులు : వ్యాయామం కోసం గాలి ఆడే, సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకుంటే మంచిది. అప్పుడు వర్కవుట్లపై దృష్టి పెట్టేందుకు వీలవుతుంది.
6. వార్మప్‌లు : తీవ్రమైన వ్యాయామానికి ముందు గాయాలను నివారించడానికి , మీ కండరాలను సిద్ధం చేయడానికి ఎల్లప్పుడూ వార్మప్ చేయండి.
7. ఖాళీ కడుపుతో వ్యాయామం : శక్తి స్థాయిలను నిర్వహించడానికి వ్యాయామానికి 1-2 గంటల ముందు తేలికైన, సమతుల ఆహారం తీసుకోండి.
8. కఠినమైన రసాయనాలు లేదా పెర్ఫ్యూమ్‌లు : వ్యాయామం చేసేటప్పుడు మీ చర్మం లేదా శ్వాసకోశ వ్యవస్థను చికాకు పెట్టే పెర్ఫ్యూమ్‌లను పూసుకోవడం మానుకోండి.
9. రెస్ట్‌రూమ్ : వ్యాయామం చేసే ముందు రెస్ట్‌రూమ్ పని పూర్తి చేసుకుంటే అసౌకర్యం, అంతరాయాలను నివారించవచ్చు.
10. వైద్యుల సలహా : దినచర్యను ప్రారంభించే ముందు కొత్త వ్యాయామం ట్రై చేస్తుంటే వైద్యుడి సలహా తీసుకోండి. ప్రత్యేకించి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు.
ఇవి కూడా చదవండి..
ఈ పదార్థాలను తేనెతో కలిపి అస్సలు తినకండి.. చాలా డేంజర్..
ఈ సింపుల్ టెస్ట్‌తో.. నకిలీ పనీర్ ఏదో ఈజీగా కనిపెట్టేయవచ్చు..
అత్యవసర పరిస్థితిలో.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన 4 రకాల మందులు..
మరిన్ని ఆరోగ్య, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..