
పలు దేశాలకు అమెరికా అందిందే మానవతా సహాయాని నిలిపివేస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా సుప్రీం కోర్టు తప్పుబట్టింది. మనవతా సాయం కింద ఇచ్చే నిధుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేందుకు వీలు లేదని స్పస్టం చేసింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. విదేశాలకు అందిస్తున్న మానవతా సాయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్‌తో పాటు వివిధ దేశాలకు అమెరికా చేస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నిధుల విడుదలను ఆపేయాలని ఉత్తర్వులలో సూచించారు.
కొత్తగా ఎలాంటి నిధులు విడుదల చేయడం కానీ, ఆర్థిక సాయానికి సంబంధించి ఇప్పటికే ముగిసిన ఒప్పందాలను రెన్యువల్ కానీ చేయొద్దన్నారు. అయితే, ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాలకు చేస్తున్న మానవతా సాయానికి మాత్రం ఈ ఆదేశాలు వర్తించవని, ఆ రెండు దేశాలకు ఆర్థిక సాయం కొనసాగిస్తామని వెల్లడించారు. అత్యవసర మందులు, ఆహారం, సైనిక సాయం కోసం నిధులు అందిస్తామన్నారు. దీంతో ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పటిషన్లపై విచారణ చేపట్టిన అమెరికా సుప్రీం కోర్టు… సాయాన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఒక వేళ ఇప్పటికే ఆ నిధుల్ని నిపివేస్తే వెంటనే సంబంధిత దేశాలకు చెల్లించాలని ఆదేశించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..