Dog Bite – RIG: కుక్క కరిచినప్పుడు టీకా తీసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

Written by RAJU

Published on:

ఇంటర్నెట్ డెస్క్: రేబీస్ అనేది అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. 99 శాతం కేసుల్లో కుక్క కాటు వల్లే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేసే ఈ వైరస్ కారణంగా మరణాల అవకాశం అత్యధికం. లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఏటా 5726 మంది రేబీస్ బారిన పడి మరణిస్తున్నారు. అయితే, రేబీస్‌కు టీకా చికిత్సతో సరిపెట్టొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది మరణానికి దారి తీస్తుందని అంటున్నారు. టీకాతో పాటు రేబీస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ (ఆర్ఐజీ) తీసుకుంటే వైరస్ నాడీ వ్యవస్థను చేరుకోకుండా అడ్డుకోవచ్చని అంటున్నారు.

కుక్క కరవగానే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కుక్కలు గీరినా, గాయం చిన్నదే అయినా నిర్లక్ష్యం వద్దని వైద్యులు చెబుతున్నారు. రేబీస్ వ్యాధి శరీరంలో వ్యాపించకుండా అడ్డుకట్ట వేసేందుకు టీకాతో పాటు ఆర్ఐజీ కూడా ఇవ్వాలని చెబుతున్నారు (Dog Bite RIG).

Alcohol effect on Bad Cholesterol: మద్యం అలవాటు మానేస్తే పెరిగే చెడు కొలెస్టరాల్.. అధ్యయనంలో వెల్లడి!

రేబీస్ నిరోధక టీకాలు రెండు ఉన్నాయి. రిస్క్ ఎక్కువగా ఉండే వెటర్నరీ వైద్యులకు ఒక రకం టీకా ఇస్తారు. ఇక కుక్క కాటు బారిన పడ్డ సందర్భాల్లో బాధితులకు రెండో రకం టీకా ఇస్తుంటారు. ఇక ఆర్‌ఐజీలో ముందుస్తుగా సిద్ధం చేసిన యాంటీబాడీలు ఉంటాయి. ఇవి రేబీస్ వ్యాధి వ్యాపించకుండా తక్షణం రక్షణ అందిస్తాయి. ఈ యాంటీబాడీలు శరీరంలోని రేబీస్ వైరస్‌ను అప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తాయి. సీరియస్ కేసుల్లో ఆర్‌ఐజీ ఇవ్వడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా టీకా వేసుకున్న 7 నుంచి 14 రోజులకు వైరస్‌కు అడ్డుకట్ట వేసేలా రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతోంది. ఈ లోపు వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థకు వ్యాపించకుండా ఆర్ఐజీ అడ్డుకట్ట వేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Dangers of Energy Drinks: పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా? ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారో తెలిస్తే..

డబ్యూహెచ్ఓ ప్రోటోకాల్ ప్రకారం, కుక్క కాటు వల్ల కలిగిన గాయాన్ని ముందు సబ్బు, నీటితో కడగాలి. గాయమైన భాగాన్ని నల్లా కింద పెట్టి నీటిని ధారగా వదలాలి. కనీసం 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత ఐయోడిన్ లేదా ఆల్కహాన్ (70 శాతం) వేస్తే వైరస్ కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఆ వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధారణంగా టీకాను ఘటన రోజు, అక్కడి నుంచి మూడు, ఏడు, 14వ రోజున మొత్తం నాలుగు డోసుల్లో టీకా ఇస్తారు. ముందస్తుగా టీకా తీసుకుంటే కుక్క కరిచాక రెండు డోసుల టీకా సరిపోతుంది. ఇక ఆర్ఐజీని నేరుగా గాయం లేదా గాయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఇంజెక్ట్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కుక్క కాటుకు గురయ్యాక టీకాతో పాటు ఏడు రోజుల లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఐజీ ఇచ్చి తీరాలి. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఐజీ కొరత ఉందని వైద్యులు చెబుతున్నారు.

Read Latest and Health News

Subscribe for notification