How Diabetes Effects on Bones and Joints : డయాబెటిస్ సమస్య శరీరంలో అతి ప్రధాన అవయవాలైన గుండె, కిడ్నీలను మాత్రమే కాదు. బాడీని దృఢంగా ఉంచే ఎముకలు, కీళ్లను బలహీనపరుస్తుంది. హైపర్గ్లైసీమియా లేదా రక్తంలో పెరిగే అధిక గ్లూకోజ్ స్థాయి ఈ సమస్యలను తీవ్రం చేస్తాయి. షుగర్ ఉన్నవారికి ఆస్టియో ఆర్థరైటిస్ (కీళ్ల క్షీణత వ్యాధి) వచ్చే ప్రమాదం ఎక్కువ. వీరి భుజాలు, మోకాళ్లు పూర్తిగా దెబ్బతినడంతో పాటు చికిత్సకు శరీరం సహకరించదు. వ్యాధులన్నీ ఒకదాన్ని మరొకటి వెంటబెట్టుకొచ్చి ఒళ్లు గుల్లబారేలా చేస్తాయి. కాబట్టి, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎముకలు, కీళ్ల సంరక్షణపై తప్పనిసరిగా దృష్టి సారించాలి. ఇందుకోసం.
షుగర్ లెవల్ పెరిగితే ఎముకలు, కీళ్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది..
-
బలహీనమైన ఎముకలు: డయాబెటిస్ వల్ల ఎముక నిర్మాణశైలి దెబ్బతింటుంది. ఎముకలను బలహీనపడి పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
-
కీళ్ల నొప్పులు : హైపర్‌గ్లైసీమియా కీళ్ల వాపుకు కారణమవుతుంది. ఫలితంగా దృఢత్వం తగ్గి విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు రోజువారీ పనులను సులభంగా చేసుకోలేక నానా అగచాట్లు పడతారు.
-
వైద్యం ఆలస్యం: మధుమేహం కారణంగా రక్త ప్రవాహం సరిగాఉండదు. ఎముకల్లో పగుళ్లు, కీళ్లకు గాయాలు ఏర్పడ్డాయంటే రోగనిరోధక వ్యవస్థ పనితీరు పూర్తిగా క్రమం తప్పుతుంది. శరీరానికి కలిగే చిన్నపాటి గాయాలు నయం కాకుండా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.
-
ఆస్టియో ఆర్థరైటిస్ : మధుమేహ వ్యాధిగ్రస్తులు బరువు, వాపు సమస్యలు ఉంటాయి. కీళ్లు దెబ్బతినడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మోకాళ్లే ఎక్కువగా అరిగిపోయే ఛాన్స్ ఉంది.
-
భుజం: షుగర్ ఉన్నవాళ్లలో భుజానికి కాప్సులైటిస్ అనే వ్యాధి రావచ్చు. దీని ప్రధాన లక్షణం ఏంటంటే భుజంలో ఉండే జాయింట్లు ఫ్రీజ్ అయిపోయి కదిలించలేకపోతారు. తీవ్రమైన నొప్పి కూడా వేధిస్తుంది.
-
లిగ్మెంట్ గాయాలు: పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు లిగ్మెంట్లను బలహీనపరుస్తాయి. అందువల్ల డయాబెటిక్ వ్యక్తులు చిన్నపాటి దెబ్బలు తగిలినా తట్టుకోలేరు. కాస్త ఎక్కువగా తగిలితే మరీ కష్టం.
ఈ ఆహారాలు తినండి..
షుగర్ ఉన్నవారు కాల్షియం, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. భోజనంలో పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, గింజలు, చేపలను తీసుకోవాలి.రక్తంలో షుగర్ లెవల్ పెరగకూడదంటే ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ప్రాసెస్ ఆహారం అసలే తినవద్దు. నడక, యోగా, వెయిట్ లిఫ్టింగ్ వంటి రోజువారీ అలవాట్లు ఎముకల బలాన్ని పెంచుతాయి. కీళ్లను దృఢంగా మారుస్తాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి సైక్లింగ్, ఈత బెస్ట్ ఆప్షన్స్. ముఖ్యమైన విషయం ఏంటంటే వెంటనే ధూమపానం, మద్యం మానేయాలి. కీళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి బరువు నియంత్రణపై దృష్టి పెట్టాలి.
చికిత్స..
పరిస్థితి తీవ్రమైనప్పుడు మోకాలు మార్పిడి చికిత్స చేయించుకోవచ్చు. ఈ సర్జరీ త్వరగా కోలుకోవడానికి అవకాశం లభిస్తుంది. ప్రధానంగా ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న డయాబెటిక్ రోగులకు ఈ చికిత్స సహాయపడుతుంది. డయాబెటిస్ రోగులు ముందు నుంచే ఎముక, కీళ్ల సమస్యలపై దృష్టి పెట్టాలి. క్రమం తప్పకుండా ఎముకకు స్కాన్లు, కీళ్ల పనితీరు గురించి వైద్యుడిని సంప్రదించి తెలుసుకుంటూ ఉండాలి.
Read Also : Copper VS Steel Water Bottle: రాగి వాటర్ బాటిల్ VS స్టీల్ వాటర్ బాటిల్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్..
Drinking Water: భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం తప్పా.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
Diabtetes Control Tips : ఈ 3 డ్రింక్స్ తాగితే.. షుగర్ సహా 4 వ్యాధుల నుంచి రిలీఫ్..