Is Glucose Powder Safe For Diabetics: వేసవి కాలంలో సూర్యుడి ఉష్ణోగ్రతల తీవ్రతకు శరీరం వేగంగా శక్తిని కోల్పోతుంది. త్వరగా అలసట, నీరసం ఆవహిస్తాయి. వీటన్నింటిని వదిలించుకుని వెంటనే ఉత్సాహం పొందేందుకు ప్రజలు రకరకాల డ్రింక్స్ తాగుతుంటారు. ఇక చాలామంది ఛాయిస్ మాత్రం గ్లూకోజ్ పౌడర్. దీన్ని నీళ్లలో కలుపుకుని తాగితే తక్షణమే ఎనర్జీ, ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే, మిగిలిన వారికంటే షుగర్ ఉన్నవారు వేగంగా డీహైడ్రేట్ అయిపోతారు. కానీ, రుచిలో తియ్యగా ఉండే గ్లూకోజ్ నీళ్లను తాగితే షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమోననే భయమూ ఉంటుంది. ఇంతకీ, డయాబెటిస్ ఉన్నవారు గ్రూకోజ్ ఎనర్జీ డ్రింక్ తాగవచ్చో లేదో చూద్దాం.
గ్లూకోజ్ పౌడర్ అంటే ఏమిటి?
గ్లూకోజ్ పౌడర్‌ను హై గ్రేడ్ డెక్స్‌ట్రోస్ తో తయారు చేస్తారు. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో దీన్ని తాగడం వల్ల శరీరానికి వేగంగా శక్తి పుంజుకుంటుంది. చెమట ద్వారా శరీరం నుండి పోయే ఉప్పు, నీరు తిరిగి లభిస్తాయి. కానీ ఈ పొడి సాధారణంగా స్వచ్ఛమైన చక్కెరతో తయారవుతుంది. కాబట్టి ఇది ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా కొంచెం హానికరం కూడా కావచ్చు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు దీన్ని తెలివిగా వాడాలి.
డయాబెటిస్‌లో గ్లూకోజ్ ఎందుకు హానికరం?
డయాబెటిస్ ఉన్నవారి శరీరం చక్కెరను సరిగ్గా ప్రాసెస్ చేయలేని స్థితిలో ఉంటుంది. అటువంటి వ్యక్తి గ్లూకోజ్ పౌడర్ కలిపిన నీళ్లు తాగితే రక్తంలో చక్కెర స్థాయి మరింత వేగంగా పెరుగుతుంది. ఈ విధంగా శరీరంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగడం చాలా హానికరం. అలసట, తలతిరుగుడుతో పాటు, ఇది కోమా వంటి తీవ్రమైన పరిస్థితులకు కూడా కారణమవుతుంది.
డయాబెటిస్ రోగులు అప్పుడప్పుడు గ్లూకోజ్ తాగవచ్చా?
డయాబెటిక్ రోగి చాలా బలహీనంగా, తల తిరుగుతూ ఉంటే లేదా చక్కెర తక్కువగా ఉంటే వైద్యుడి సలహా మేరకు కొద్ది మొత్తంలో గ్లూకోజ్ ఇవ్వవచ్చు. కానీ డయాబెటిక్ రోగులు వైద్యుడిని సంప్రదించకుండా గ్లూకోజ్ తీసుకోకూడదు. బదులుగా, మీరు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ వంటి సహజమైన, తక్కువ చక్కెర కలిగిన పానీయాలను తాగేందుకు ప్రాధాన్యత ఇస్తే ఆరోగ్యానికి మంచిది.
Read Also: Medication Mistakes: టాబ్లెట్స్ వేసుకున్నాక ఈ పనులు చేస్తే.. గ్యాస్, అల్సర్..
Eye Cancer: సైలెంట్‌గా కళ్లను కాటేస్తున్న క్యాన్సర్.. ఈ లక్షణాలుంటే బీ అలర్ట్..
Mangoes: మధుర ఫలం.. కెమికల్స్‌తో విషతుల్యం