క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ఇటీవలే తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. విడాకుల తర్వాత మళ్లీ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. చాహల్ ప్రస్తుతం ఐపీఎల్ లో బిజీగా ఉంటున్నాడు. మరోవైపు ధనశ్రీ వర్మ కూడా తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆమె ఇప్పుడు అతిపెద్ద హిందీ రియాలిటీ షోలో పోటీ పడనుంది. ఈ వార్త ధనశ్రీ అభిమానులను సంతోషపరిచింది. అలాగే ధనశ్రీ వర్మ సినిమా రంగంలోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ‘ఖత్రో కే ఖిలాడీ’ హిందీలో బాగా పాపులర్ అయిన రియాల్టీ షో. ఇప్పటికే 14 సీజన్లు పూర్తయ్యాయి. అలాగే 15వ సీజన్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ రియాలిటీ షోకి ధనశ్రీ వస్తుందని సమాచారం. దీనికి సంబంధించి ప్రస్తుతం ధనశ్రీతో ‘ఖత్రో కే ఖిలాడీ’ టీమ్ చర్చలు జరుపుతోంది. ధనశ్రీ పేరు ప్రస్తుతం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమెను షోకి తీసుకువస్తే బాగుంటుందని రియాలిటీ షో నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం మొదటి దశ చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
కాగా ధనశ్రీ వర్మకు ఇలాంటి రియాలిటీ షోలు కొత్త కాదు. ఆమె గతంలో ‘ఝలక్ ధిక్లా జా’ రియాలిటీ షోలో పాల్గొంది. ఈ షో 2023లో ప్రసారం అయింది. చాహల్ కూడా ఆ షోలో పాల్గొని తన భార్యకు తన మద్దతును తెలియజేశాడు. ఇక ధనశ్రీ, చాహల్ 2020 లో వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాలు కలిసి కాపురం చేసిన తర్వాత ఈ ఏడాది మార్చిలో విడిపోయారు. 2022 నుంచి వారు విడివిడిగా జీవిస్తున్నారని చెబుతున్నారు. విడాకుల్లో భాగంగా ధనశ్రీకి రూ.4.75 కోట్ల భరణం లభించిందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ధన శ్రీ వర్మ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
డ్యాన్స్ ప్రాక్టీస్ లో బిజి బిజీగా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.