Devotees on the Ayodhya Ram Temple are ready for the divine Surya Tilak

Written by RAJU

Published on:

  • ఈ రోజు రామ నవమి పండుగ
  • అయోధ్యలో అంబరాన్నంటిన సంబరాలు
  • బాలరాముడి నుదిటిపై సూర్య తిలకం
Devotees on the Ayodhya Ram Temple are ready for the divine Surya Tilak

ఈ రోజు రామ నవమి పండుగ. అయోధ్యలోని భవ్యమైన రామాలయంలో వేడుకలు జరుగుతున్నాయి. రామనగరి శ్రీరాముని జయంతి ఆనందంలో మునిగిపోయింది. రామాలయంతో పాటు, అయోధ్యలోని అన్ని ఆలయాలను పూలతో అలంకరించారు. అయోధ్యకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయోధ్యా నగర వైభవం భిన్నంగా కనిపిస్తుంది. పుట్టినరోజు వేడుకలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యాయి.

READ MORE: Bird Flu Virus: పల్నాడులో బర్డ్ ఫ్లూ కలకలం.. రీజనల్ సర్వేలెన్స్ సెంటర్ ఏర్పాటు

ఈ వేడుకలపై రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉదయం శ్రీరాముడికి అభిషేకం జరుగుతుంది. ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు స్వామివారిని అలంకరిస్తారు. ఆ తరువాత, ప్రసాద వితరణ ఉంటుంది. అప్పటికి మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. చైత్ర శుక్ల నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు భగవంతుని జన్మదినోత్సవం నిర్వహిస్తారు. బలరాముడికి ఆరతి నిర్వహిస్తారు. దేవునికి 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాముడు సూర్యవంశం సూర్య వంశంలో జన్మించాడు.

READ MORE: Bird Flu Virus: పల్నాడులో బర్డ్ ఫ్లూ కలకలం.. రీజనల్ సర్వేలెన్స్ సెంటర్ ఏర్పాటు

భాస్కరుడు తన కిరణాలతో శ్రీరాముడికి తిలకం దిద్దుతాడు. సూర్య తన కిరణాలతో రామ్ లల్లా నుదిటిపై తిలకం ఏర్పడుతుంది. దీనిని సూర్య తిలకం అంటారు. గతేడాది కోట్లాది భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తరించారు. మరోసారి చూసేందుకు ఎదురుచూస్తున్నారు. రాంలాలా నుదిటిపై సూర్యకిరణాలు దాదాపు 4 నిమిషాల పాటు పడతాయని రాయ్ చెప్పారు. ఇది టీవీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి అయోధ్యకు వచ్చిన రామ భక్తులు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య తిలకాన్ని చూసి ఆనందస్తారు.

Subscribe for notification
Verified by MonsterInsights