Deputy CM Bhatti Vikramarka has made it clear that all facilities will be provided in Young India Schools

Written by RAJU

Published on:

  • 20-25 ఎకరాల్లో అన్ని వసతులతో టీచింగ్ స్టాఫ్‌కి వసతి
  • అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు
  • డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేశాం
  • రాష్ట్ర విద్యారంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయం
  • డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలు
Deputy CM Bhatti Vikramarka has made it clear that all facilities will be provided in Young India Schools

దేశ చరిత్రలోనే యంగ్ ఇండియా స్కూల్స్‌ను రూ.11,600 కోట్లతో మంజూరు చేస్తూ నిన్న జీవో జారీ చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇలాంటి స్కూల్స్ ఈ దేశంలో ఎక్కడా లేవన్నారు. 20-25 ఎకరాల్లో అన్ని వసతులతో టీచింగ్ స్టాఫ్స్ కి కూడా అక్కడే వసతి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు.. డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ లో చదివించలేని పిల్లలకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్ర విద్యారంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఇబ్బందులు ఉన్నా.. ప్రజల జీవన స్థితిగతులు మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

READ MORE: BMW C 400 GT: స్టైలిష్ లుక్, స్మార్ట్ ఫీచర్లతో బీఎమ్ డబ్ల్యూ కొత్త స్కూటర్.. ధర తెలిస్తే గుండె గుభేలే

పరిపాలన అంటే ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనమే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “గత పదేళ్ల ప్రభుత్వం.. గురుకులాలను కోళ్ల ఫారాలు, పశువుల షెడ్ లో పెట్టారు. కానీ పెద పిల్లలకు మంచి విద్యను ఇవ్వాలని ప్రతి రూపాయి వాళ్ళ కోసమే ఖర్చు. ఆనాటి ప్రభుత్వం 7.19 లక్షల కోట్ల అప్పు, దానికి మిత్తి మీద పడుతున్నా… అవి చెల్లిస్తూనే.. పథకాలు కొనసాగిస్తున్నాం. ప్రస్తుత గురుకులాల్లో పిల్లల ఇబ్బందులకు నాటి ప్రభుత్వమే కారణం. డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచాలన్న ఆలోచన ఎందుకు చెయ్యలేదు. ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు నేరుగా అందలనేదే మా ఉద్దేశ్యం. వచ్చే ఏడాది నాటి ఇళ్లను కూడా ఈ ఏడాదే ఇవ్వాలని ఆలోచన ఉంది.” అని పొంగులేటి వ్యాఖ్యానించారు.

READ MORE: CM Revanth Reddy: బీఆర్ఎస్‌కి పురుడు పోసింది కొండా లక్ష్మణ్ బాపూజీ.. కానీ పార్టీ ఏం చేసింది?

Subscribe for notification